Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కృషి కళ్యాణ్' పేరుతో పన్ను... ఫోనులో మాట్లాడినా.. ప్రయాణం చేసినా బాదుడే!

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (14:50 IST)

Widgets Magazine

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 'కృషి కళ్యాణ్' పేరుతో ప్రజలపై పన్నుభారం మోపేందుకు సిద్ధమైంది. దీనికితోడు ప్రస్తుతం వసూలు చేస్తున్న స్వచ్ఛ భారత్ సేవా పన్నును మరో 0.5 శాతం పెంచింది. దీంతో ఎడ్యుకేషన్ సెస్‌తో కలిపి 14.5 శాతానికి పెరిగింది. మరోవైపు కృషి కళ్యాణ్ పేరుతో మరో పన్నును కేంద్రం వసూలు చేయనుంది. ఇది జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. దీంతో దేశ ప్రజలపై అదనపు భారం పడనుంది. 
 
ముఖ్యంగా వ్యాపార ప్రకటనలు, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్ట్ సేవలు, గృహ నిర్మాణం, క్రెడిట్ కార్డుల వాడకం, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర సేవలు భారం కానున్నాయి. దీంతో పాటు టెలికం రంగం నుంచి అందుకునే సేవలపైనా భారం పడనుంది. మాట్లాడే ఫోన్ కాల్స్‌కు అధిక బిల్లులు ఇచ్చుకోవాలి. హోటల్స్ బిల్లులు భారం కానున్నాయి. దాదాపు అన్ని రకాల సేవలపైనా ఈ కొత్త పన్నుల భారం పడనుంది. కేవలం వైద్య సేవల రంగం వంటి అతి కొద్ది విభాగాలకు మాత్రమే ఈ కొత్త పన్ను భారం నుంచి మినహాయింపునిచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

బడ్జెట్‌తో ధరలు పెరిగేవి.. తరిగేవి ఏవి : కృషి కళ్యాణ్ పన్నుతో బాదుడు!

విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ కారణంగా అనేక వస్తువుల ధరలు మరింతగా ...

news

బడ్జెట్ 2016 : ఆదాయ, వ్యయ వివరాలు... ప్రధాన రంగాల కేటాయింపులివే

విత్తమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016 వార్షిక బడ్జెట్‌ ఆదాయ, వ్యయ ...

news

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే.. రూ.3 వేలు మినహాయింపు .. అరుణ్ జైట్లీ

దేశవ్యాప్తంగా రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారి పట్ల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ...

news

సాధారణ బడ్జెట్ 2016 : ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులేదు

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016 వార్షిక బడ్జెట్‌లో ...

Widgets Magazine