పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి కల్పన... ఇదే బడ్జెట్ టార్గెట్

budget
ivr| Last Modified శనివారం, 20 ఫిబ్రవరి 2016 (20:45 IST)
వచ్చే బడ్జెట్ 2016-17 ప్రధానంగా పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి కల్పన పైన దృష్టి పెడుతుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంతి సిన్హా శనివారం నాడు వెల్లడించారు. దేశంలో పేదరికాన్ని పారదోలి, యువతకు ఉపాధి కల్పనకు కావలసిన అడుగులు ఈ బడ్జెట్టులో ఉంటాయని చెప్పారు. కాగా ఫిబ్రవరి 29న కేంద్రం వార్షిక బడ్జెట్టును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇది ఎన్డీయే రెండో ఏడాదిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్.

స్థిరమైన వృద్ధిరేటును సాధించే దిశగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. కాగా ఈ బడ్జెట్టులో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయో అనే చర్చ అప్పుడే నడుస్తోంది.దీనిపై మరింత చదవండి :