Widgets Magazine

అద్దె ఇంట్లో ఉండే వారికి మినహాయింపు రూ.24 నుంచి రూ.60వేలకు పెంపు!

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:35 IST)

అద్దె ఇంట్లో ఉండే వారికి అద్దె మినహాయింపు రూ.24 నుంచి రూ.60వేలకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఒక్కరోజులోనే స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించేలా చర్యలు చేపట్టినట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యలోటు 3.5 శాతంగా నమోదైందన్నారు.

రెవెన్యూ లోటు 2.5 శాతమని జైట్లీ వెల్లడించారు. పంటల బీమా పథకాలకు నిధులను రెట్టింపు చేశామని ప్రకటించారు. 9 సూత్రాల ఆధారంగా పన్ను మినహాయింపును ప్రకటించామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో పోస్టాఫీసుల్లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తామన్నారు. 
 
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇకపై పాత్రికేయులకు బడ్జెట్‌ హార్డ్‌ కాపీల పంపిణీకి ప్రభుత్వం స్వస్తి పలికింది. పార్లమెంట్‌, ఎన్‌ఎంసీలలో ఈసారి ఇవి అందుబాటులో ఉండవు. అటవీ శాఖ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. గృహరుణాలపై వడ్డీ మినహాయింపు మరో రూ.50వేలు పెంచినట్లు జైట్లీ వెల్లడించారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రోడ్లు-రహదారులకు రూ. 97,000 కోట్లు... తమన్నా హ్యాపీ... రీట్వీట్

అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన చెపుతూ... ...

news

కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుందట.. కొత్తగా కోటి మందికి ఉద్యోగాలు: అరుణ్ జైట్లీ

పరిశుభ్రతకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకోసమే ఆయన ప్రధానిగా ...

news

బడ్జెట్ 2016-17: ప్రతి కుటుంబానికీ రూ.లక్ష వర్తించేలా కొత్త బీమా పథకం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ...

news

గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.97 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం.. అరుణ్ జైట్లీ

దేశంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ చేకూరనుంది. గ్రామీణ భారతంలోని రోడ్ల నిర్మాణానికి కేంద్ర ...

Widgets Magazine