రైలు బోగీలు శుభ్రంగా ఉంచండి మహాప్రభో... రైలుచార్జీలు పెంచొద్దు ప్లీజ్!

suresh prabhu
pnr| Last Updated: మంగళవారం, 23 ఫిబ్రవరి 2016 (15:33 IST)
ఈనెల 25వ తేదీన 2016-17 సంవత్సరానికి రైల్వే వార్షిక బడ్జెట్‌ను ఆ శాఖామంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రైలు చార్జీలు పెంపు భారం ఉండబోదన్న సంకేతాలు వినొస్తున్నాయి. అదేసమయంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

అలాగే, ఈ బడ్జెట్‌లో కొత్త రైళ్ల సంగతి దేవుడెరుగు. ముందు రైలు ప్రయాణికులకు భద్రత పెంచండి అంటూ ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం తన శాఖ బడ్జెట్‌‌ను పార్లమెంట్ ముందు ఉంచుతారు. రైల్వే బడ్జెట్‌పై దేశప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సౌకర్యాలు పెంచకుండా రైలు చార్జీలు పెంచడం తగదని రైలు ప్రయాణికులు వాదిస్తున్నారు.

ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ఖర్చులు పెరిగిపోతున్నాయని ఈ నేపథ్యంలో రైలు చార్జీలు పెంచడం అంత మంచిది కాదని కొందరి వాదన. కొత్త రైల్వేజోన్‌ల డిమాండ్ కూడా పెరుగుతున్నాయి. తమ ప్రాంతానికి రైల్వేజోన్ వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందని జనం నమ్ముతున్నారు. రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు దీనిపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :