గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:28 IST)

రైల్వేలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ రెడీ!

రైల్వేలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చిందని కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ 2016-17ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇది ప్రజా రైల్వే బడ్జెట్‌గా సురేశ్ ప్రభు అభివర్ణించారు. రక్షణ  లేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించే దిశగా ప్రయత్నిస్తున్నామని సురేశ్ ప్రభు వెల్లడించారు. 
 
ఇకపోతే.. పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టామని, సమయపాలన వసతులకు ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. సామాన్యుల ఆకాంక్షకు ప్రతిబింబంగా రైల్వే బడ్జెట్ ఉంటుందన్నారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే  సగటున 50. కి.మీ ఉన్న వేగాన్ని 80 కి.మీగా పెంచామని మంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది పది శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.