మంగళవారం, 1 జులై 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:18 IST)

రైల్వే బడ్జెట్ ప్రజల బడ్జెట్... సామాన్యుల ఆశలు ప్రతిఫలించేలా బడ్జెట్ .. సురేశ్ ప్రభు

2016-17 రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సరిగ్గా 12 గంటలకు ఆయన తన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల ఆశలు ప్రతిఫలించేలా ఈ బడ్జెట్‌ రూపకల్పన చేసినట్టు ఆయన తన ప్రారంభ ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. 
 
ప్రయాణికులపై ఛార్జీల భారం మోపకుండా, రైల్వే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మందగంలో ఉందని, అయినా సవాళ్ళ మధ్య మన ప్రయాణం కొనసాగతున్నట్టు  చెప్పారు. ఇద దేశ ప్రజల బడ్జెట్ అని చెప్పారు. దేశాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికే రైల్వేలు బాసటగా నిలుస్తాయన్నారు. దేశానికి అన్ని విధాలా ఉపయోగపడేలా ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్టు ఆయన తెలిపారు.