Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నల్లధనంపై యుద్ధం ప్రకటించాం... నగదు రహిత విధానానికి బాటలు వేశాం : అరుణ్ జైట్లీ

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:35 IST)

Widgets Magazine
arun jaitley

నల్లధనంపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదేసమయంలో నగదు రహిత చెల్లింపులకు బాటలు వేసినట్టు ఆయన తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే సిట్టింగ్ ఎంపీ ఈ. అహ్మద్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను ప్రారంభిస్తూ అహ్మద్‌కు నివాళులర్పించారు. అహ్మద్ ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన గౌరవార్థం గురువారం సభ సమావేశాలు జరగబోవని ప్రకటించారు. 
 
దీనికి విపక్షమైన కాంగ్రెస్ అడ్డుతగిలింది. కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ... సభను ఈరోజు వాయిదా వేసి, బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. అదేసమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఖర్గేకు మద్దతుగా మాట్లాడారు. అయితే, ఆయన విజ్ఞప్తిని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. దీంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. అరుణ్ జైట్లీ జైట్లీ ప్రవేశపెడుతుండటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 
 
జైట్లీ ప్రవేశపెడుతున్న 2017-18 వార్షిక బడ్జెట్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... బ్లాక్‌ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించినట్టు తెలిపారు. గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నట్టు గుర్తు చేశారు. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారన్నారు.
 
రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చిందని, ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటామని హామీ ఇచ్చారు. వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, గత చరిత్రకు భిన్నంగా సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం హిస్టారికల్ డేగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
నల్లధనంపై యుద్ధం ప్రకటించి, పెద్దనోట్లను రద్దు చేసినట్టు తెలిపారు. వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం. పరోక్ష పన్నులపై పార్లమెంట్‌‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసినట్టు చెప్పారు. 
 
సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ. నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది, 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Budget 2017 Speech Parliament Finance Minister Arun Jaitley

Loading comments ...

బిజినెస్

news

ప్రత్యేక హోదా అంటున్న పవన్ గింగరాలు తిరిగే పవర్ పంచ్... రేపటి బడ్జెట్ 2017లో జైట్లీ....?

కొద్దిసేపటికే క్రితమే ఏపీ ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జావగారిపోయినట్లు ...

news

ప్రధాని మోడీ పాలనలో పెరుగుదల : బిఫోర్ మోడీ.. ఆఫ్టర్ మోడీ

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ ...

news

రూ.50వేలకు మించి బంగారం కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి..

ప్రస్తుతం రూ.2లక్షలకు మించి బంగారం కొంటే కేవైసీ వివరాలు అందించాల్సి ఉంది. అయితే ఇకపై ఆ ...

news

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి గణనీయంగా తగ్గాయి: ప్రణబ్ ముఖర్జీ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ...

Widgets Magazine