Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రత్యేక హోదా అంటున్న పవన్ గింగరాలు తిరిగే పవర్ పంచ్... రేపటి బడ్జెట్ 2017లో జైట్లీ....?

మంగళవారం, 31 జనవరి 2017 (21:27 IST)

Widgets Magazine

కొద్దిసేపటికే క్రితమే ఏపీ ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జావగారిపోయినట్లు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వలేం అంటే ఆలోచిస్తాం అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. ప్రత్యేక ప్యాకేజీ అర్థరాత్రి ఎందుకు తీసుకొచ్చారు అని ప్రశ్నించారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వం అంటే పోరాడుతాం అని అన్లేదు. దీనికీ ఓ లెక్కుంది అంటున్నారు పొలిటిల్ పండిట్స్. అదేంటయా అంటే... విశ్వసనీయ సమాచారం ప్రకారం రేపు కేంద్రం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్టులో మెయిన్ ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ పైనే వుండబోతోందట. 
pawan-arun
 
ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల పెంపు, రాయితీల పెంపు, అమరావతి రైతులకు భరోసానిచ్చే హామీలు... ఇలా ఏపీపై బడ్జెట్టులో వరాల జల్లు కురుస్తుందని అనుకుంటున్నారు. అలాగే ప్రత్యేక హోదాలో ఏమేమి లభిస్తాయో.... అంతకుమించిన ప్రయోజనాలను ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ఇవ్వబోతుందని సమాచారం. 
 
అదే జరిగితే ఇక ఏపీ భాజపా నాయకులు ప్రత్యేక హోదా ద్వారా లభించే ప్రయోజనాలు ఏమిటి... ప్యాకేజీ ద్వారా వస్తున్నవి ఏమిటో ప్రజలకు సవిరంగా చెప్పేందుకు ఏపీ వ్యాప్తంగా సభలు పెట్టి మరీ చెప్పేందుకు సిద్ధమవుతారు. తద్వారా ప్రత్యేక హోదా అంటే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా చేయడమే భాజపా-తేదేపా ప్రణాళికగా ఉందని అంటున్నారు. అందువల్లనే మంగళవారం పవన్ ప్రత్యేక హోదాపై మెత్తబడినట్లు మాట్లాడారు. చూడాలి రేపటి బడ్జెట్టులో ఏపీ లెక్క ఎంత గట్టిగా వుంటుందో...?!!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ప్రధాని మోడీ పాలనలో పెరుగుదల : బిఫోర్ మోడీ.. ఆఫ్టర్ మోడీ

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ ...

news

రూ.50వేలకు మించి బంగారం కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి..

ప్రస్తుతం రూ.2లక్షలకు మించి బంగారం కొంటే కేవైసీ వివరాలు అందించాల్సి ఉంది. అయితే ఇకపై ఆ ...

news

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి గణనీయంగా తగ్గాయి: ప్రణబ్ ముఖర్జీ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ...

news

స్వతంత్ర భారతావనిలో ఇదో చారిత్రాత్మక ఘట్టం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ...

Widgets Magazine