Widgets Magazine Widgets Magazine

బడ్జెట్ 2017-18 : మొత్తం రూ.21.47 లక్షల కోట్లు... రక్షణ రంగానికి రూ.2.74 లక్షల కోట్లు.. రైల్వేకు ఎంత?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:17 IST)

Widgets Magazine
budget2017-18

కేంద్ర ఆర్థిక మంత్రి  అరుణ్‌ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా, దేశ మొత్తం బడ్జెట్, రక్షణ రంగానికి, రైల్వే శాఖకు కేటాయించిన బడ్జెట్ వివరాలను పరిశీలిస్తే.. 
 
* 2017-18 వార్షిక బడ్జెట్ రూ.21 లక్షల 47 వేల కోట్లు
* రక్షణ రంగానికి రూ.2 లక్షల 74 వేల కోట్లు
* శాస్త్ర సాంకేతిక రంగానికి రూ.34,435 కోట్లు
* వార్షిక వ్యయ ప్రణాళిక రూ.21.47 లక్షల కోట్లు
* రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.4.11 లక్షల కోట్లు
* ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం ఉండొచ్చు
* వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేస్తాం
* వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు 1.9 శాతం
* రైల్వే బడ్జెట్ రూ. లక్షా 31 వేల కోట్లు. 
* వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు
* ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్‌ ట్యాక్స్‌ లేదు
* రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు
* రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు
* 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్‌
* 7 వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్‌ పవర్‌ ఏర్పాటు
* కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లుWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

వేతన జీవులపై కరుణ చూపని జైట్లీ : రూ.2.5 లక్షల వరకు నిల్... రూ.5 లక్షలలోపు 5 శాతం ట్యాక్స్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ...

news

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017, IRCTC బుకింగ్‌లో ఇకపై నో సర్వీస్ చార్జెస్

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017 ప్రవేశపెడుతున్నారు. ఇందులో ...

news

బడ్జెట్‌-2017కి మొరార్జీ దేశాయ్‌కి లింకేంటి? జమ్మూ రైతులకు 60 రోజుల రుణ మాఫీ..

గుజ‌రాత్‌లోని బ‌ల్స‌ర్ జిల్లాలో ఉన్న భ‌డేలీ గ్రామంలో 1896 ఫిబ్ర‌వ‌రి 29న శ్రీ‌ మొరార్జీ ...

news

ఐఆర్‌సీటీసీ రైల్వే టిక్కెట్లపై సేవా పన్ను రద్దు... భద్రతకు పెద్దపీట : విత్తమంత్రి

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్ ద్వారా బుక్ ...