Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వచ్చే ఐదేళ్ళలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: విత్తమంత్రి జైట్లీ

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:45 IST)

Widgets Magazine
budget 17

వచ్చే ఐదేళ్లలో దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆయన బుధవారం లోక్‌సభలో 2017-18 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చేసిన కీలక వ్యాఖ్యలను పరిశీలిస్తే... 
 
గత యేడాది వర్షాలు బాగా కురిసిన కారణంగా ఈ ఏడాది వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఈసారి రికార్డు స్థాయిలో రూ.10 లక్షల కోట్లు రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తొలి 60 రోజులు వడ్డీలేని రుణ ఇస్తామని, రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఈ ఆదాయ రెట్టింపునకు మార్గదర్శకాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 
 
అలాగే, దేశంలోని ప్రతి కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాయిల్ హెల్త్ కార్డుల జారీ వేగం పుంజుకుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేందుకు పంటల బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ పథకం కింద మరో 40 శాతం కవరేజ్ పెంచుతున్నట్టు తెలిపారు.
 
సాగునీటి సౌకర్యం కోసం రూ. 40 వేల కోట్లతోకార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనామ్‌లు 240 నుంచి 500లకు పెంచుతున్నట్టు తెలిపారు. 2017-18లో జీడీపీ 7.6 శాతంగా ఉంటుందని, 2018-19లో జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసినట్టు తెలిపారు. భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎదిగిందని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

నల్లధనంపై యుద్ధం ప్రకటించాం... నగదు రహిత విధానానికి బాటలు వేశాం : అరుణ్ జైట్లీ

నల్లధనంపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదేసమయంలో ...

news

ప్రత్యేక హోదా అంటున్న పవన్ గింగరాలు తిరిగే పవర్ పంచ్... రేపటి బడ్జెట్ 2017లో జైట్లీ....?

కొద్దిసేపటికే క్రితమే ఏపీ ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జావగారిపోయినట్లు ...

news

ప్రధాని మోడీ పాలనలో పెరుగుదల : బిఫోర్ మోడీ.. ఆఫ్టర్ మోడీ

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ ...

news

రూ.50వేలకు మించి బంగారం కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి..

ప్రస్తుతం రూ.2లక్షలకు మించి బంగారం కొంటే కేవైసీ వివరాలు అందించాల్సి ఉంది. అయితే ఇకపై ఆ ...

Widgets Magazine