బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By ivr
Last Modified: బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:07 IST)

అరుణ్ జైట్లీ చెప్పిన ఆ లెక్కలు తిక్క ఎక్కించేలా లేవూ...? బాగా దొరికిపోతున్న వేతన జీవులు...

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2017లో వివిధ తరగతుల్లో ఆదాయం కలిగిన ప్రజల సంఖ్యను చూస్తే షాకింగ్ అనిపించక మానదు. భారతదేశ జనాభా 130 కోట్లయితే అందులో రూ. 2.5-5 లక్షల ఆదాయం కలిగిన వారు 1.5 కోట్ల మంది మాత్రమేనట. ఇక రూ. 5-10 లక్షల మధ్య ఆదాయం వున్నవారు

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2017లో వివిధ తరగతుల్లో ఆదాయం కలిగిన ప్రజల సంఖ్యను చూస్తే షాకింగ్ అనిపించక మానదు. భారతదేశ జనాభా 130 కోట్లయితే అందులో రూ. 2.5-5 లక్షల ఆదాయం కలిగిన వారు 1.5 కోట్ల మంది మాత్రమేనట. ఇక రూ. 5-10 లక్షల మధ్య ఆదాయం వున్నవారు 52 లక్షల మంది అయితే రూ. 10 లక్షలకు పైగా ఆదాయం వున్నవారి సంఖ్య 24 లక్షల మంది అని గణాంకాలతో వివరించారు. 
 
అంటే... మొత్తంగా చూసినప్పుడు రూ. 2.5 లక్షల నుంచి రూ. 10 లక్షల పైవరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారి సంఖ్య సుమారుగా 2.26 కోట్ల మంది అని తెలుస్తోంది. ఈ ప్రకారం 130 కోట్ల మంది భారతదేశ జనాభాలో ఆదాయం వున్నవారి సంఖ్య 2.26 కోట్లయితే మిగిలిన 127.7 కోట్లమంది రూ.2.5 లక్షల కంటే దిగువున ఉన్నారా...? ఈ లెక్కలు తిక్క ఎక్కించేలా లేవూ..? బాగా పరిశీలిస్తే ఈ లెక్కల్లో దొరికిన జీవులంతా ఉద్యోగాలు చేసుకుని బతుకులీడుస్తున్న మధ్యతరగత మానవులే. కాబట్టి ఇంకా ఎంతోమంది నల్లకుబేరులు అనేక రూపాల్లో వున్నట్లు అనిపించడంలేదూ... నల్లధనుల పనిబట్టడం సాధ్యం కాదని తేలిపోవడంలేదూ..?