శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By ivr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:27 IST)

ఇంతకీ ఏపీకి జైట్లీ ఏమిచ్చారు...? వైసీపీ వాకౌట్.... బాబు రెండు వేళ్లు చూపిస్తారా?

ఈసారి బడ్జెట్లోనూ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా చోటు దక్కలేదు. పెద్దగా ప్రయోజనాలు దక్కిన దాఖలాలు లేవు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించిన ప్రకటనలు జైట్లీ నోట రాలేదు. దీనితో ఏపీ పరిస్థితి

ఈసారి బడ్జెట్లోనూ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా చోటు దక్కలేదు. పెద్దగా ప్రయోజనాలు దక్కిన దాఖలాలు లేవు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించిన ప్రకటనలు జైట్లీ నోట రాలేదు. దీనితో ఏపీ పరిస్థితి యధాస్థితిగానే వుండనుంది. విశాఖ రైల్వే జోన్ ఊసేలేదు. ప్రత్యేక హోదా మాట లేదు. అమరావతి రైతులకు కేపిటల్ గెయన్స్ వల్ల నో యూజ్, ట్యాక్స్ గెయిన్స్ అయితే కొద్దోగొప్పో ఉపయోగం వుండేదని విశ్లేషకులు అంటున్నారు.
 
ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత ఆందోళనలు చేస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నుంచి వాకౌట్ చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో...? ఏం చెపుతారో...?