శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 జులై 2021 (16:26 IST)

కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌కాలంలో ఉడాన్‌పై భారతదేశంగా 15 మిలియన్‌ల కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్‌ సేల్స్

భారతదేశంలో అతి పెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ-కామర్స్‌ వేదిక ఉడాన్‌, మహమ్మారి సెకండ్‌ వేవ్‌ సమయంలో తమ వేదికపై కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్‌ విక్రయాలకు సంబంధించిన వివరాలను నేడు వెల్లడించింది. దాదాపు 15 మిలియన్‌ల కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్‌ను 23 వేలకు పైగా ఆర్డర్ల ద్వారా 400 మందికి పైగా విక్రేతలు 5వేలకు పైగా పిన్‌కోడ్స్‌ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా విక్రయించారు. ఈ వేదికపై రక్షిత మాస్కులు, ఫేస్‌ షీల్డ్స్‌, పీపీఈ సూట్లుకు ఐదు రెట్లకు పైగా డిమాండ్‌ పెరిగింది.
 
మార్చి ఆరంభం నుంచి నెమ్మదిగా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గడం వరకూ  మొత్తంమ్మీద 6మిలియన్ల కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్‌ను అస్సాం, ఆంధ్రప్రదేశ్‌; పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లకు రవాణా చేశారు. ఈ రాష్ట్రాలలోనే 50%కు పైగా ఆర్డర్లు ఉడాన్‌ ప్లాట్‌ఫామ్‌పై  కొవిడ్‌ ఎసెన్షియల్స్‌కు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక మరియు అస్సాం రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఫేస్‌ షీల్డ్స్‌ ఆర్డర్లు ఈ వేదికపై వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఇన్‌ఫ్రారెడ్‌ ధర్మామీటర్లు విక్రయించగా, అనుసరించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ ఉన్నారు. పీపీఈ కిట్లకు డిమాండ్‌ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా, తరువాత స్థానాలలో  పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా ఉన్నాయి.
 
ఉదయ్‌  భాస్కర్‌, హెడ్-లైఫ్‌స్టైల్‌, ఎలక్ట్రానిక్స్‌, జనరల్‌ మర్చండైజ్‌ (నాన్‌-ఫుడ్‌ బిజినెస్‌), ఉడాన్‌ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌-19 కాలంలో విధించిన నిబంధనల కారణంగా రిటైలర్ల సరఫరా చైన్‌ మరియు పంపిణీ వ్యవస్థ పై ప్రభావం పడింది. ఈ సంక్షోభ సమయంలో, మేము అవాంతరాలు లేని రీతిలో, సమయానికి తగినట్లుగా కోవిడ్‌ సేఫ్టీ ఎసెన్షియల్స్‌ను అత్యుత్తమ ధరలలో కొనుగోలుదారులకు మా వేదికపై అందించాం. తద్వారా వినియోగదారులకు స్ధిరంగా మా రిటైల్‌ భాగస్వాములు  తమ సేవలను కొనసాగించారనే భరోసానూ అందించాం. అంతేకాకుండా ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగేలా కూడా చేశాం’’ అని అన్నారు.