శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 నవంబరు 2021 (19:20 IST)

సమతుల ఆహారానికి చక్కటి నాణ్యత కలిగిన వంట నూనె అవసరం

వెచ్చటి కౌగిలిలో ఒదిగిపోవాలనిపించే శీతగాలులను ఎవరిష్టపడరు? వాతావరణం కొద్దిగా చల్లబడితే చాలు, మూలన ఉన్న స్వెటర్లను బయటకు తీస్తుంటారు. ఆహారంపై మన గ్రంధాలు వెల్లడించే దాని ప్రకారం సమతుల ఆహారంతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మనకు మరింత శక్తినందించేలా ఉండటమే కాదు శరీరానికి వెచ్చదనమూ అందించాలి.

 
మహమ్మారి ఆరంభమైన అనంతరం చాలామంది వీలైనంతగా ఇళ్లలోనే వండుకున్న ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనితో పాటుగా చేసే వంటకాలలో ప్రయోగాలు కూడా గణనీయంగా పెరిగాయి. మనం మరిచిపోయిన సంప్రదాయ వంటకాలు మొదలు అమ్మమ్మల కాలం నాటి వంటకాల రహస్యాలతో పాటుగా నేటి కాలపు క్విక్‌ రెసిపీల వరకూ గత రెండేళ్ల కాలంలో ఎనెన్నో ఆవిష్కరణలను గృహిణిలు చేశారు.

 
రోగ నిరోధక శక్తి మెరుగుపరిచే పదార్థాలను వంటకాలలో వాడటం పెరిగింది. వారాంతంలో కుటుంబమంతా కలిసి భోజనం చేయడాన్ని ఓ అలవాటుగానూ మార్చుకున్నారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ పోషకాలను అందించే వంటకాలు మాత్రమే కాదు వైవిధ్యమైన రుచులతో కూడిన వంటకాలూ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమ పిల్లలకు ఆనందాన్ని అందిస్తూనే వారి ఆరోగ్యం మెరుగుపరిచే వంటకాల పట్ల మాతృమూర్తులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. విభిన్నమైన ప్రాంతీయ వంటకాలు, అంతే విభిన్నమైన పదార్ధాలు కూడా కనిపిస్తున్నాయిప్పుడు.

 
అత్యుత్తమ వంటకాలెప్పుడూ కూడా అంతే ఉత్తమ నాణ్యత కలిగిన పదార్థాలు వాడినప్పుడే చక్కటి రుచి అందిస్తాయి. దీనిలో వంటకు ఉపయోగించే నూనె కూడా అత్యంత కీలకం. ఇంటిలో వంట చేసేటప్పుడు స్వచ్ఛత మరియు ప్రపంచ శ్రేణి నాణ్యతతో కూడిన నూనె కూడా కావాల్సి ఉంటుంది. వంటకాల రుచి అమోఘంగా ఉంటూనే మొత్తం కుటుంబానికి ఆనందాన్ని కలిగించే ఆహారం కోసం మంచి నూనె కూడా కావాల్సి ఉంది.

 
ప్రపంచశ్రేణి, ప్రీమియం రిఫైండ్‌ నూనె గోల్డ్‌ డ్రాప్‌. ఇది పూర్తి స్వచ్ఛంగా ఉండటంతో పాటుగా బ్రాండ్‌ వాగ్ధానమైనటువంటి స్వచ్ఛత, నాణ్యతను అందిస్తుంది. తేలికగా ఉండటంతో పాటుగా దీని యొక్క స్వచ్ఛత కారణంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు గోల్డ్‌ డ్రాప్‌ను తమ ప్రాధాన్యతా వంటనూనెగా ఎంచుకుంటున్నాయి. నూనె ఎంత తేలికగా ఉంటే ఆ నూనె అంత స్వచ్ఛంగా ఉంటుంది. అంతేకాదు ఆయిల్‌ ఎప్పుడూ సువాసనతో కూడి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గోల్డ్‌డ్రాప్‌లో ఉన్నాయి.

 
మితేష్‌ లోహియా, డైరెక్టర్‌,సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ మాట్లాడుతూ, ‘‘అత్యుత్తమ ముడిపదార్ధాలను గోల్డ్‌ డ్రాప్‌ వినియోగిస్తుంది. అల్ట్రా మోడ్రన్‌ రిఫైనింగ్‌ సదుపాయాలతో పాటుగా ఖచ్చితమైన నాణ్యత పరీక్షలను సంస్థ కలిగి ఉంది. గోల్డ్‌డ్రాప్‌లో స్థిరమైన నాణ్యత, స్వచ్ఛత ప్రతి చుక్కలోనూ కనిపించడం వల్ల నేడు వినియోగదారులు దీనిని అభిమానిస్తున్నారు’’ అని అన్నారు.