Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆధార్ నంబర్ ఉంటేనే రైల్ టిక్కెట్?

బుధవారం, 9 మే 2018 (08:52 IST)

Widgets Magazine

ఆధార్ నంబర్ ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ప్రారంభించడం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే కూలీ రేట్లకు కూడా ఆధార్ నంబరును తప్పనిసరి చేశారు. తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు కూడా తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ సర్క్యులర్‌ను జారీచేయనుంది.
<a class=aadhaar card" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-05/09/full/1525836267-9371.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ఇటీవల ఈ-టికెట్ల (ఆన్‌లైన్ స్కామ్) కుంభకోణం వెలుగుచూసింది. రైల్వే అధికారులు ఇటీవల ముంబైకి చెందిన సల్మాన్‌ ఖాన్‌ నుంచి రూ.1.5 కోట్ల విలువైన 6 వేల ఈ-టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. 5400 మంది ఏజెంట్లను పెట్టుకొని.. తన బుకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నందుకు వారి నుంచి ప్రతి నెలా రూ.700లను సల్మాన్ ఖాన్ వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
 
ఈ నేపథ్యంలో రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ఈ దిశగా చర్యలు తీసుకోనుంది. ఇందులో టికెట్ల రాకెట్‌ను అడ్డుకొనేందుకు కొన్ని కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. ప్రయాణికుల యూజర్‌ ఐడీలను వారి ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేయాలని సూచించారు. అంతేగాక 'బుక్‌ నౌ' మీట నొక్కగానే ఓ ప్రశ్న/ఓటీపీ వచ్చే పద్ధతినీ పెట్టాలని సూచించారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఆధార్ రైల్ టిక్కెట్లు రైల్వే మంత్రి ఈ-టిక్కెట్స్ స్కామ్ Aadhaar E-ticket Scam Railway Ministry Rail Tickets

Loading comments ...

బిజినెస్

news

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ...

news

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ...

news

పీఎఫ్ పోర్టల్ డేటా లీకైందా? 2.7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల వివరాలు?

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారుల వివరాలు హ్యాక్‌కు గురైయ్యాయి. దేశవ్యాప్తంగా 2.7కోట్ల ...

news

తమిళనాడు విద్యుత్ బోర్డుతో భారత్ బిల్‌పే కీలక ఒప్పందం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ప్రారంభించిన ఆన్‌లైన్ పేమెంట్స్ ...

Widgets Magazine