Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆధార్ ‌- పాన్‌ లింకు తప్పనిసరి... అనుసంధానంపై మరో వెసులుబాటు

ఆదివారం, 2 జులై 2017 (13:30 IST)

Widgets Magazine

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ నంబరు అనుసంధానంపై ఆదాయపు పన్ను విభాగం మరో అవకాశం కలిగించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అనుసంధానం చేసుకొనే అవకాశం ఉండగా, తాజాగా కాగితంపై దరఖాస్తు చేసుకునే వీలును కూడా కలిగించింది. 
 
ఈ దరఖాస్తు ఒక పేజీ మాత్రమే ఉంటుంది. ఆధార్‌, పాన్‌లలో నమోదైన పేరు స్పెల్లింగ్‌ల్లో తేడా ఉంటే ఆ విషయాన్ని పేర్కొనాలి. వీటిని సంబంధిత కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
 
ఈ దరఖాస్తులో ఆధార్‌ సంఖ్య, శాశ్వత ఖాతా సంఖ్య, ఆధార్‌లో నమోదైన పేరు, పాన్‌లో నమోదైన పేరు, ఈ ఆధార్‌ సంఖ్యను ఇతర ‘పాన్‌’తో అనుసంధానం చేయడానికి సమర్పించలేదంటూ స్వీయ ధ్రువీకరణ అనే కాలమ్స్ ఉంటాయి. ఇందులో పేర్కొన్నది తప్ప మరో ‘పాన్‌’ లేదంటూ ఇంకో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. 
 
అంతేకాకుండా, పన్ను చెల్లింపుదారులు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేయవచ్చు. ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంది. ‘పాన్‌’ సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొనే సౌకర్యం కూడా కల్పించారు. పాన్‌ దరఖాస్తులు స్వీకరించే సేవా కేంద్రాల్లోనూ అనుసంధానం చేస్తారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

జి.ఎస్.టి... ధరలు తగ్గే వస్తువులు, పెరిగే వస్తువులు ఏవి?(వీడియో)

జీఎస్టీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేసింది. దీనితో దీని ప్రభావం ఏ వస్తువులపై వుంటుందని ...

news

జీఎస్టీ అంటే ప్రజల డబ్బులను ముంచివేయడమేనా? పీపీఎఫ్‌, కేవీపీ వడ్డీ రేట్లపై మళ్లీ కోత

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్‌ సేవింగ్‌ స్కీం, కిసాన్ వికాస పత్ర (కేవీపీ) ...

news

వెబ్ సైట్ కుప్పగూలితే తప్ప ఆదాయ పన్ను శాఖ మేల్కొదు.. ఆ పాన్ కార్డులు చెల్లుతాయట

వెబ్ సైట్ కుప్పగూలితే తప్ప ఆదాయ పన్ను శాఖ మేల్కొదు అని మరోసారి రుజువైంది. పాన్‌ కార్డుతో ...

news

GST... రూ. 5 లక్షల కారు కొనేవారికి రూ.5 వేలు తగ్గింపట... హిహ్హిహ్హ్హీ....

జీఎస్టీ పన్నుపై సెటైర్లు మామూలుగా వుండటంలేదు. అటు మధ్యతరగతి వారికి వాతలు పెట్టేస్తున్న ...

Widgets Magazine