శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (20:01 IST)

నీట్‌ అభ్యర్థుల కోసం మొట్టమొదటిసారిగా సెల్ఫ్‌ ఇవాల్యుయేషన్‌ టూల్‌ విడుదల చేసిన ఆకాష్‌ బైజూస్‌

image
బోధనాంశాలను అతి సులభంగా మార్చడంతో పాటుగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు విద్యార్థులను అతి సన్నిహితంగా తీసుకువచ్చేందుకు, భారతదేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌ ఇప్పుడు నో యువర్‌ ఎన్‌సీఈఆర్‌టీ (కెవైఎన్‌) కిట్‌‌ను నీట్‌ అభ్యర్థుల కోసం విడుదల చేసింది. ఈ టూల్‌ కిట్‌ క్యూరేటెడ్‌ మాడ్యుల్‌ను ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ మరియు జువాలజీ అంశాలలో పదకొండు మరియు పన్నెండవ తరగతి ఆకాష్‌ బైజూస్‌ విద్యార్థులకు పూర్తి స్థాయి అభ్యాస అనుభవాలను అందించనుంది.
 
కెవైఎన్‌ కిట్‌ను ఎన్‌సీఈఆర్‌టీ కంటెంట్‌ను తరచుగా రివిజన్‌ చేసుకునే రీతిలో అభివృద్ధి చేశారు. దీనితో ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయడంతో పాటుగా మనసులో వాటిని జ్ఞప్తికి ఉంచుకోవచ్చు. ఈ ప్రశ్నలను నేపథ్యాలు మరియు వాస్తవాల ఆధారంగా తీర్చిదిద్దారు. ఇవి పాత ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలను అధికంగా అడుగుతుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్స్‌బుక్స్‌లోని పలు లైన్స్‌, నీట్‌ సంబంధితంగా ఉంటాయి. కానీ వీటిని తరచుగా విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తారు. వీటిని సైతం విశ్లేషించడంతో పాటుగా లోతైన పరిజ్ఞానంతో ప్రశ్నలను రూపొందించారు.
 
నీట్‌లో అడిగే అనేక రకాల ప్రశ్నలను అర్ధం చేసుకోవడంలో కెవైఎన్‌ విద్యార్థులకు సహాయం చేస్తుంది మరియు అలాంటి ప్రశ్నలకు వేగం మరియు ఖచ్చితత్త్వంతో సమాధానమివ్వగల సామర్ధ్యాన్ని  పొందుతుంది. ఇది విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ తో తమ స్థాయి సంసిద్ధతను స్వయంగా మదింపు చేసుకునే అవకాశం అందిస్తుంది. అలాగే తాము ఏ అంశాలలో మెరుగుపరుచుకోవాలో కూడా తెలుపుతుంది. ఈ టూల్‌కిట్‌ నీట్‌ అభ్యర్థులకు గేమ్‌ ఛేంజర్‌గా నిలువడంతో పాటుగా ప్రతి చాప్టర్‌ ముగింపు తరువాత నీట్‌ విధానానికి అనుగుణంగా పలు ప్రశ్నలనూ అందిస్తుంది. ఇది లోతైన విశ్లేషణతో విద్యార్ధులు ప్రొఫెషియెన్సీ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కెవైఎన్‌‌తో ఎన్‌సీఈఆర్‌టీ  సైతం మిళితం చేయడం వల్ల వేగవంతంగా వాటిని పునశ్చరణ చేసుకోవడమూ సాధ్యమవుతుంది.
 
ఈ ప్రోగ్రామ్‌ గురించి ఆకాష్‌ బైజూ్‌స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, శ్రీ అభిషేక్‌ మహేశ్వరి మాట్లాడుతూ, ‘‘మా విద్యాబోధన మరియు స్టడీ మెటీరియల్‌  చాలా సంవత్సరాలుగా డాక్టర్లు మరియు ఇంజినీర్లను సృష్టిస్తుంది మరియు స్థిరమైన ఆవిష్కరణతో  ఈ వారసత్వం కొనసాగిస్తుంది. అత్యాధునిక అకడమిక్‌ డెలివరీ మెథడాలజీలో పురోగతితో బాగా శోధించబడిన మరియు సంబంధితమైన స్టడీ మెటీరియల్‌ స్థిరమైన ఆవిష్కరణ మరియు సృజనాత్మక వారసత్వంతో కొనసాగుతుంది’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘నీట్‌లో విజయానికి తొలి అడుగుగా ఎన్‌సీఈఆర్‌టీ ఉంటుంది. మేము ఎప్పుడూ కూడా అత్యాధునిక అకడమిక్‌ డెలివరీ పద్ధతులను వినియోగించి స్టడీ మెటీరియల్స్‌ ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి చేస్తూనే ఉంటాము. నో యువర్‌ ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటుగా తమ సహచరుల కంటే మెరుగ్గా రాణించడంలో సహాయపడుతూనే నీట్‌లో అత్యధికంగా స్కోరింగ్‌ చేయడానికి సహాయపడుతుంది. మా కార్యక్రమం అభ్యాసకులను నిమగ్నం చేయడం మరియు పెంపొందించడం లక్ష్యంగా ఉంది మరియు నిరంతరం విద్యా బోధన మరియు స్టడీ మెటీరియల్స్‌ను మెరుగుపరుస్తాము’’ అని అన్నారు.