ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (10:30 IST)

ఎయిరిండియాలో తెలుగులో కూడా కస్టమర్ కేర్ సర్వీసులు!!

airindia
భారతదేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రయాణికులకు పలు భాషల్లో కస్టమర్ కేర్ సర్వీసులు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కస్టమర్ కేర్ సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీష్ భాషలకే పరిమితమైన ఈ సేవలను ఇప్పుడు తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది.
 
తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా కస్టమర్ కేర్ సేవలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ) సిస్టం, వారి భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌‍గా గుర్తిస్తుందని ఎయిరిండియా పేర్కొంది.
 
'భారతీయ భాషలలో బహుభాషా మద్దతును ప్రవేశపెట్టడం మా ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. ఈ భారతీయ భాషలను మా కస్టమర్ సపోర్ట్ సర్వీసుల్లోకి చేర్చడం ద్వారా మేము మా పరిధిని విస్తరించడమే కాకుండా మా కస్టమర్లతో సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకున్నట్లు అయింది. ఎయిరిండియాతో ప్రయాణికులందరినీ కలుపుకుపోయేలా చూస్తాం' అని ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు.