శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2019 (14:04 IST)

అమ్మకానికి ఎయిరిండియా.. బీపీసీ కూడా... నిర్మలా సీతారామన్ వెల్లడి

అప్పుల్లో కూరుకుని పోయిన ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ ఎయిరిండియాతో పాటు.. భారత్ పెట్రోల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లను విక్రయించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలను వచ్చే సంవత్సరం మార్చిలోగా విక్రయిస్తామన్నారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం రూ.58 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆమె తెలిపారు. 'రెండు కంపెనీల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి చేయాలని భావిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం ఉంటుంది' అని తెలిపారు. 
 
కాగా, ఈ నెలారంభంలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు బహిరంగ లేఖను రాసిన సంస్థ చైర్మన్ అశ్వని లోహానీ, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ తర్వాత సంస్థ నిలదొక్కుకుంటుందన్న భరోసాను ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపుతున్నారని అన్నారు.