రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేస్ట్-టు-వెల్త్ సామర్థ్యాన్ని వినియోగించే దిశలో కీలకమైన అడుగు
స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దారితీసే ప్రగతిశీల అడుగులో, ఆర్సెలర్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) దేశంలోని ప్రముఖ శాస్త్రీయ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CRRI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉక్కు స్లాగ్ ఆధారిత రహదారి నిర్మాణ సాంకేతికతను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తూ, ఈ భాగస్వామ్యం ద్వారా ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ అగ్రిగేట్లను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన స్టీల్ స్లాగ్ వాలరైజేషన్ టెక్నాలజీకి గౌరవనీయమైన లైసెన్స్ పొందిన మొదటి భారతీయ సంస్థగా AM/NS ఇండియా ఘనత సాధించింది.
AM/NS ఇండియా గుజరాత్‌లోని హజీరాలో ఉన్న తమ ఫ్లాగ్షిప్ ప్లాంట్‌లో రహదారి నిర్మాణ అవసరాల కోసం స్టీల్ స్లాగ్ అగ్రిగేట్లను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడాన్ని సాధ్యం చేసే CSIR-CRRI అభివృద్ధి చేసిన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు స్టీల్ స్లాగ్ వాలరైజేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్డ్ EAF స్టీల్ స్లాగ్ అగ్రిగేట్స్ ఎట్ AM/NS ఇండియా ప్లాంట్ ఇన్ హజీరా ఫర్ యుటిలైజేషన్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్ లైసెన్స్ సర్టిఫికెట్‌ను పొందింది.
AM/NS ఇండియా ప్రస్తుతం AM/NS ఆకార్ బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన స్టీల్ స్లాగ్ ఉత్పత్తిని చేస్తోంది, ఇది CSIR-CRRI రూపొందించిన కఠినమైన సాంకేతిక మార్గదర్శకాలు, లక్షణాలు, నాణ్యత నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది సాధారణంగా రహదారి, హైవే నిర్మాణాలలో ఉపయోగించే సహజ సముదాయాల కంటే ఎక్కువ మన్నికను కలిగి ఉండడమే కాకుండా, ఖర్చు పరంగా కూడా మరింత ప్రయోజనకరంగా తేలింది. ఈ ఉత్పత్తి పర్యావరణ అనుకూల పదార్థాలను ప్రాధాన్యంగా ఎంపిక చేసే మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, వారి సుస్థిరత మెట్రిక్స్‌ను మెరుగుపరచడంలో కీలకంగా నిలుస్తుంది. AM/NS ఇండియా సంవత్సరానికి సుమారు 1.70 మిలియన్ టన్నుల స్టీల్ స్లాగ్ను ఉత్పత్తి చేస్తూ ఉండగా, వాటిని ఇప్పుడు CSIR-CRRI అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం సాధ్యమవుతుంది.
సతీష్ పాండే, CSIR-CRRI సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కర్త ఇలా అన్నారు, "స్టీల్ స్లాగ్ టెక్నాలజీ భారత రహదారి మౌలిక సదుపాయాల్లో ఒక గేమ్‌చేంజర్. దేశం ప్రతి సంవత్సరం సుమారు 19 మిలియన్ టన్నుల స్టీల్ స్లాగ్ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, శుద్ధి చేయని స్లాగ్‌ను నేరుగా ఉపయోగించడం వలన తయారయ్యే మిశ్రమాల యాంత్రిక లక్షణాలు, మన్నిక తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ లైసెన్స్ ద్వారా, భారతదేశపు మొట్టమొదటి ఆల్ స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణానికి మాతో కలిసి పనిచేసిన AM/NS ఇండియా, ఇప్పుడే రహదారి నిర్మాణ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయంగా ప్రాసెస్ చేయబడిన స్టీల్ స్లాగ్ను తయారు చేయడం, మార్కెట్ చేయడం, విక్రయించడం చట్టబద్ధంగా కొనసాగించగలదు."
మిస్టర్. రంజన్ ధార్, సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్, ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) ఇలా అన్నారు, “ఈ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానానికి లైసెన్స్ పొందిన దేశంలో తొలి సంస్థగా నిలవడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాము. ఈ ముందడుగు సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పట్ల మా నిబద్ధతను స్పష్టం చేస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ఆవిష్కరించిన 'వ్యర్థాల నుంచి సంపద' దృష్టికి ఇది అనుగుణంగా ఉంది. అంతేకాక, ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన, హజీరాలో నిర్మించిన ప్రపంచపు మొట్టమొదటి ఉక్కు స్లాగ్ రహదారిలో మా భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది.”