సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (22:04 IST)

ఈ పండుగ సీజన్‌ వేళ అమెజాన్‌ ఇండియాలో లక్షకు పైగా సీజనల్‌ ఉద్యోగావకాశాలు

అమెజాన్‌ ఇండియా నేడు, రాబోతున్న పండుగ సీజన్‌ కోసం దేశవ్యాప్తంగా తమ నిర్వహణ నెట్‌వర్క్‌లో ఒక లక్షకు పైగా సీజనల్‌ ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు వెల్లడించింది. ఈ నూతన సీజనల్‌ ఉద్యోగాలతో తమ డెలివరీ అనుభవాలను వృద్ధి చేయడంతో పాటుగా కంపెనీ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్‌ మరియు డెలివరీ సామర్థ్యంలను మెరుగుపరిచి పండుగ సీజన్‌లో పెరిగే డిమాండ్‌ను అందుకోనుంది.
 
ఈ నూతన అసోసియేట్లు అమెజాన్‌ యొక్క ప్రస్తుత విస్తృతస్థాయి నెట్‌వర్క్‌ అసోసియేట్లుతో చేరడంతో  పాటుగా వారికి తీసుకోవడం, ప్యాక్‌ చేయడం, రవాణా మరియు  వినియోగదారుల ఆర్డర్లను సురక్షితంగా మరియు సమర్థవంతంగా డెలివరీ చేయడంలో తోడ్పడనున్నారు. ఈ కంపెనీ పరోక్షంగా వేలాది అవకాశాలను తమ పార్టనర్‌ నెట్‌వర్క్స్‌ అయినటువంటి ట్రకింగ్‌ భాగస్వాములు, ప్యాకేజింగ్‌ వెండార్లు, ‘ఐ హ్యావ్‌ స్పేస్‌’ డెలివరీ భాగస్వాములు, అమెజాన్‌ ఫ్లెక్స్‌ భాగస్వాములు మరియు హౌస్‌ కీపింగ్‌ ఏజెన్సీలు వంటి వారెందరో అసాధారణ డిమాండ్‌ను ఈ కాలంలో తీర్చేందుకు మద్దతునందించనున్నారు.
 
ఈ సంవత్సరం తొలి అర్థభాగంలో, అమెజాన్‌ ఇండియా దాదాపు 70వేల సీజనల్‌ ఉద్యోగాలను తమ ఆపరేషనల్‌ నెట్‌వర్క్‌ మరియు కస్టమర్‌ సర్వీస్‌ కేంద్రాల వద్ద సృష్టించింది. దీనితో పాటుగా నేటి ప్రకటనతో 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో ఒక మిలియన్‌ నూతన ఉద్యోగావకశాలను సృష్టించాలన్న అమెజాన్‌ ఇండియా యొక్క నిబద్ధతను చాటుతుంది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా ఈ లక్ష్యం చేరుకోనుంది.
 
‘‘ఈ పండుగ సీజన్‌లో, దేశంలో ప్రతి చోటా వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన మరియు క్లిష్టత లేని ఈ-కామర్స్‌ అనుభవాలను అందించడం ద్వారా వారి ఇంటి వద్దనే సురక్షితమైన విధానంలో సేవలనందించాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం, ఒక లక్షకు పైగా సీజనల్‌ అసోసియేట్లు మాతో చేరనున్నారు. తద్వారా వినియోగదారుల వాగ్ధానం తీర్చనున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగావకశాలను సృష్టించేందుకు, మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి ఎంతో మందికి జీవనోపాధి పరంగా సవాళ్లు విసిరిన సమయంలో అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము..’’ అని అఖిల్‌ సక్సేనా, వైస్‌ ప్రెసిడెంట్‌–ఏపీఏసీ, మెనా అండ్‌ లాతమ్‌ కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఆపరేషన్స్‌, అమెజాన్‌ ఇండియా అన్నారు.
 
గత కొద్ది నెలలుగా, అమెజాన్‌ తాము 10 నూతన ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటుగా ప్రస్తుత తమ 7 కేంద్రాలను ఈ సంవత్సరం విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీకి ఇప్పుడు 32 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల నిల్వ సామర్థ్యం ఉంది. విభిన్న ప్రాంతాలలో 6.5 లక్షల అమ్మకందారులకు మద్దతునందిస్తుంది. అమెజాన్‌ ఇండియా  తమ సార్ట్‌ సెంటర్‌ (ఎస్‌సీ) నెట్‌వర్క్‌ను సైతం 5 నూతన ఎస్‌సీలు ప్రారంభించడం ద్వారా విస్తరించడానికి ప్రణాళిక చేసింది.
 
వీటితో పాటుగా తమ ప్రస్తుత 8 ఎస్‌సీ కేంద్రాలను 19 రాష్ట్రాలలో విస్తరించనుంది. ఈ కంపెనీ తమ డెలివరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను దాదాపు 200 అమెజాన్‌ సొంతమైన మరియు డెలివరీ పార్టనర్‌ స్టేషన్స్‌ జోడించడం ద్వారా విస్తరించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ ఫ్లెక్స్‌ మరియు ‘ఐ హ్యావ్‌ స్పేస్‌’ వంటి డెలివరీ కార్యక్రమాల ద్వారా వేలాది మంది వ్యక్తులకు అదనపు ఆదాయం పొందే అవకాశాలు అందిస్తుంది.
 
అమెజాన్‌ ఇండియా తమ ఉద్యోగులు, అసోసియేట్లు మరియు భాగస్వాముల కోసం ఎన్నో నివారణ ఆరోగ్య ప్రమాణాలను తీసుకువచ్చింది. తమ సైట్ల వద్ద భౌతిక దూర ప్రమాణాలు పాటించడం, ఫేస్‌ కవరింగ్‌ వినియోగించడం, రోజూ ఉష్ణోగ్రత పరీక్షలు చేయించడం వంటి 100కు పైగా ఇతర ప్రమాణాలను తమ భవంతులలో తీసుకువచ్చింది. అన్ని ఆర్డర్లనూ నో కాంటాక్ట్‌ డెలివరీ ద్వారా అందిస్తున్నారు.  అక్కడ డెలివరీ అసోసియేట్లు బెల్‌ ను కొట్టి, ప్యాకేజీలను డోర్‌ వద్ద ఉంచి, రెండు మీటర్లు దూరం జరుగుతారు.
 
తమ భద్రత కోసం వారు భౌతిక దూర ప్రమాణాలను అనుసరిస్తారు. ఇదే రీతిలో నో-కాంటాక్ట్‌ మార్గదర్శకాలను పే ఆన్‌ డెలివరీల వద్ద కూడా అనుసరిస్తారు. అదనంగా,  డెలివరీ అసోసియేట్లు అందరూ తరచుగా తమ చేతులను శానిటైజ్‌ చేసుకోవడంతో పాటుగా  తమ వాహనాలలో తరచుగా స్పృశించే ఉపరితలాలను సైతం శుభ్రపరుస్తారు. అంతేకాదు, డెలివరీ సమయంలో వారంతా ఖచ్చితంగా ఫేస్‌ కవరింగ్‌ను వినియోగించడం తప్పనిసరి.