శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 జులై 2017 (17:36 IST)

పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్... సుప్రీం ఆదేశాలతో కేంద్రం చర్యలు

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు కొంత సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసినప్పటికీ.. అనేక మంది వద్ద పాత నోట్లు ఉన

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు కొంత సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసినప్పటికీ.. అనేక మంది వద్ద పాత నోట్లు ఉన్నాయి. అయితే, పాత నోట్ల మార్పిడికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ జరిపిన అపెక్స్ కోర్టు... కొన్ని సూచనలు చేసింది. దీంతో మెత్తబడిన కేంద్ర ప్రభుత్వం మరోసారి నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. మరో రెండు వారాల్లో అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పాత నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. 
 
ఈ విషయమై ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇస్తే, ఓ నిర్ణయానికి వస్తామని, మంగళవారం సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ అత్యున్నత ధర్మాసనానికి తెలిపిన సంగతి విదితమే. పైగా, పాత నోట్ల వ్యవహారంలో కేంద్రంతో పాటు... ఆర్బీఐను కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించిన విషయం తెల్సిందే.