శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (13:59 IST)

ఉత్పత్తిని నిలిపివేసిన అశోక్ లేల్యాండ్... సెప్టెంబరులో ప్రొడక్షన్ హాలిడే

దేశంలో ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం విక్రయాలు గణనీయంగా తగ్గిపోయారి. దీంతో అనేక కంపెనీలు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. తాజాగా ప్రముఖ భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 
 
త‌న‌ ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ లేక‌పోవ‌డంతో కొన్ని ప్లాంట్ల‌లో ఉత్ప‌త్తిని నిలిపివేయ‌నున్న‌ట్లు అశోక్ లేల్యాండ్ సోమవారం ప్రకటించింది. అలాగే, సెప్టెంబరు నెలలో ప్రొడ‌క్ష‌న్ హాలీడేను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొంది. స్టాక్ మార్కెట్ల‌కు కూడా ఈ విష‌యాన్ని చేర‌వేసింది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని ఎన్నూరు ప్లాంట్‌లో 16 రోజులు, హోసూర్ ప్లాంట్‌లో అయిదు రోజుల పాటు ఉత్ప‌త్తి ఉండ‌ద‌ని తెలిపింది. ఇదే నెల‌లో పంత్‌న‌గ‌ర్ ప్లాంట్‌లో 18 రోజులు, అల్వార్‌, బందారా ప్లాంట్ల‌లో ప‌దేసి రోజులు ఉత్ప‌త్తి ఉండ‌ద‌ని సంస్థ వివరించింది. 
 
కాగా, ఆర్థిక మాంద్యం దెబ్బకు ఇప్పటికే మారుతి సుజికీ సంస్థ కొన్ని ప్లాంట్ల‌లో ఉత్ప‌త్తిని నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో పెద్ద కంపెనీ అశోక్ లేల్యాండ్ కూడా ఇదే నిర్ణ‌యాన్ని వెల్లడించడంతో ఆటోమొబైల్ రంగం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కూరుకున్నట్టు తెలుస్తోంది.