గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 మే 2021 (20:30 IST)

భారతదేశపు నెంబర్‌ 1 మోటర్‌సైకిల్‌ తయారీదారునిగా 2022 ఆర్ధిక సంవత్సరంలోకి బజాజ్‌ ఆటో

బజాజ్‌ ఆటో నూతన ఆర్థిక సంవత్సరంలోనికి అత్యధిక ఎగుమతుల ప్రదర్శనతో ప్రవేశించింది. భారతదేశంలో అగ్రశ్రేణి మోటర్‌సైకిల్‌ విభాగంగా ఇది దీనిని నిలిపింది. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంతో సహా) 3,48,173 యూనిట్లను బజాజ్‌ ఆటో విక్రయించింది. వీటిలో 2,21,603 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. తద్వారా భారతదేశపు నెంబర్‌ 1 మోటర్‌సైకిల్‌ తయారీదారునిగా  ఏప్రిల్‌ 2021లో నిలిచింది.
 
భారతీయ ఆటోమొబైల్‌ ఎగుమతులకు బజాజ్‌ ఆటో నేతృత్వం వహిస్తుంది. గత సంవత్సరం దాదాపు 60% దేశీయ మోటర్‌సైకిల్‌ మరియు మూడు చక్రాల వాహన ఎగుమతులను ఇది చేసింది. 2020–2021 ఆర్ధిక సంవత్సరంలో బజాజ్‌ ఆటో యొక్క ఎగుమతుల ఆదాయం 12,687 కోట్ల రూపాయలుగా నిలిచింది. బజాజ్‌ ఆటో ఉత్పత్తులను 79 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
 
 గత 10 సంవత్సరాలలో మొత్తంమ్మీద 18 మిలియన్‌ వాహనాలను ఎగుమతిచేసింది బజాజ్‌. అంతర్జాతీయంగా అత్యధికంగా కనబడుతున్న భారతీయ ద్విచక్రవాహన బ్రాండ్‌ బజాజ్‌.  తద్వారా ప్రపంచం అభిమానించే భారతీయునిగా నిలిచింది.  కంపెనీ యొక్క అంతర్జాతీయ అమ్మకాలు 14 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని గత దశాబ్ద కాలంలో సముపార్జించాయి.
 
భారతదేశంలో స్పోర్ట్స్‌ మోటర్‌ సైకిల్‌ విభాగానికి 2001లో తమ పల్సర్‌ వాహనాన్ని ఆవిష్కరించడం ద్వారా  బజాజ్‌ ఆటో నేతృత్వం వహిస్తుంది.  ఇది ఇప్పటికీ భారతదేశంలో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతుండటంతో పాటుగా పలు విదేశీ మార్కెట్‌లలో సైతం తమ ప్రస్థానం చాటుతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో, బజాజ్‌ ఆటో అంతర్జాతీయంగా 1.25 మిలియన్‌ యూనిట్ల పల్సర్‌ను విక్రయించింది. దాదాపు 80%కు పైగా బజాజ్‌ ఆటో ఎగుమతులు నెంబర్‌ 1 లేదా నెంబర్‌ 2 స్ధానాలను ఇది ఆస్వాదిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చాయి.
 
ఈ మైలురాయి గురించి శ్రీ రాకేష్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బజాజ్ ఆటో మాట్లాడుతూ " అత్యంత సవాల్‌తో కూడిన వాతావరణంలో కూడా 2022 ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలాంశాలతో మేము ఆరంభించాము. మేము తయారుచేస్తోన్న విస్తృతశ్రేణి మోటర్‌సైకిల్స్ శ్రేణి ప్రవేశ దశ వాహనాలతో పాటుగా మధ్య మరియు ప్రీమియం తరహా విభాగాలను సైతం కవర్ చేయడంతో పాటుగా ఆఫ్రికాలోని మోటో ట్యాక్సీ డ్రైవర్ మొదలు యూరోప్‌లో సాహస ప్రేమికులతో సహా విస్తృతశ్రేణిలో వినియోగదారులతో అనుసంధానించబడేందుకు సైతం తోడ్పడుతుంది! నేటి అనిశ్చితి అలాగే అస్థిరతను నిర్వహించేందుకు, మా వాటాదారులందరికీ వ్యాపార చక్రాలను కదిలించేందుకు ఈ వైవిధ్యత ఎంతో కీలకం'' అని అన్నారు.
 
బజాజ్‌ ఆటో తమ ప్రతిష్టాత్మక బ్రాండ్‌ చేతక్‌ను ప్రీమియం, ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా గత సంవత్సరం పునరుద్ధరించింది. దీనికి అపూర్వమైన స్పందన లభించింది. ఇటీవలనే చేతక్‌ కోసం బుకింగ్స్‌ పునరుద్ధరించడం జరిగింది. పూనె మరియు బెంగళూరులలో ఇది 36 గంటలలోపుగానే విక్రయించబడింది. రాబోయే సంవత్సరంలో తమ ఉనికిని మరో 24 నగరాలకు విస్తరించేందుకు ప్రణాళిక చేసింది.
 
బజాజ్‌ ఆటోకు కెటీఎం ఏజీతో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాలు ఉన్నాయి. దాదాపు 50% కెటీఎం యొక్క వార్షిక అంతర్జాతీయ అమ్మకాలను కెటీఎం మరియు బజాజ్‌లు సంయుక్తంగా రూపకల్పన చేశాయి. బజాజ్‌ ఆటో యొక్క అత్యాధునిక తయారీ కేంద్రం ఉన్న చకన్‌లో ఈ వాహనాలను తయారుచేస్తున్నారు. ఈ విజయవంతమైన భాగస్వామ్యం ఇప్పుడు ప్రపంచంలో నెంబర్‌ 1 ప్రీమియం మోటర్‌ సైకిల్‌ బ్రాండ్‌గా కెటీఎం నిలిచేందుకు దోహద పడింది.
 
తమ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా వృద్ధి చెందుతున్న  డిమాండ్‌కు మద్దతునందించేందుకు బజాజ్‌ ఆటో ఇటీవలనే మహారాష్ట్రలోని చకన్‌లో తాము నిర్మించబోతున్న నాల్గవ ప్లాంట్‌లో 650 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్లు వెల్లడించింది. ఇక్కడ తమ ప్రీమియం బ్రాండ్‌ మోటర్‌సైకిల్స్‌తో పాటుగా చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను తయారుచేయనున్నారు.
 
ప్రపంచంలో మూడవ అతిపెద్ద మోటర్‌సైకిల్‌ తయారీ బ్రాండ్‌ బజాజ్‌ ఆటో. ప్రపంచంలోనే అత్యధికంగా మూడు చక్రాల వాహనాలను తయారుచేసే సంస్థ కూడా ఇది. ప్రపంచంలో అత్యంత విలువైన ద్విచక్రవాహన కంపెనీగా ఇది 1,10,864 కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను ఇది పొందింది. భారతదేశంలో తరువాత స్థానంలో అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.