సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (16:24 IST)

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకును ఆవిష్కరించిన బజాజ్ ఆటో!!

cng bike
దేశ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచలోనే తొలి సీఎన్జీ బైకును శుక్రవారం ప్రవేశపెట్టింది. ఫ్రీడమ్‌ 125 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్‌ ట్యాంక్‌ను అమర్చారు. పెరిగిన పెట్రోల్‌ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్‌ ఊరటనిస్తుందని బజాజ్‌ ఆటో తెలిపింది. ఈ బైకు ధర, మైలేజీ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫ్రీడమ్‌ 125 బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్‌ డిస్క్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్‌ ఆటో పేర్కొంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌తో మొత్తం ఏడు రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుందని, ఇందులో డిస్క్‌ ఎల్‌ఈడీ వేరియంట్‌ ధరను రూ.1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్‌ ఎల్‌ఈడీ 1.05 లక్షలు, డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.95 వేలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది.