శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (16:57 IST)

బీజేపీ ఆదాయం రూ.వెయ్యి కోట్లు...

భారతీయ జనతా పార్టీ తన ఆదాయ వ్యయ వివరాలను ప్రకటించింది. 2017-18 సంపత్సరంలో ఆ పార్టీ ఏకంగా 1027.34 కోట్ల రూపాయల మేరకు ఆదాయం అర్జించింది. ఈ మొత్తంలో 74 శాతం అంటే రూ.758.47 కోట్లు ఖర్చు చేసినట్లు భాజపా ప్రకటించింది. 
 
2017-18 ఆర్థిక సంవత్సరానికిగానూ పార్టీలు సమర్పించిన ఆడిట్‌ నివేదికల ఆధారంగా రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) తాజాగా నివేదిక రూపొందించింది. దీని ప్రకారం..
 
2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భాజపా ఆదాయం స్వల్పంగా తగ్గింది. 2016-17లో కమలం పార్టీ రూ.1,034.27కోట్ల ఆదాయం గడించగా.. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,027.34 కోట్లకు తగ్గింది.