శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:09 IST)

#Budget2019... 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి రూ.3వేలు పింఛన్‌

ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు ఫించన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు ఫించన్ విధంగా పథకాన్ని ప్రవేశపెట్టారు.


రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌. అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని గోయెల్ ప్రకటించారు. 
 
ఇదేవిధంగా పేద రైతుల ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టామని గోయెల్ తెలిపారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద  రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం. 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.