శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (11:48 IST)

బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త... రూ.50 వేలు విత్‌డ్రా

బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు తర్వాత నగదు విత్‌డ్రాపై పలు రకాల ఆంక్షలు విధించి అమలు చేసింది. ఇపుడు ఈ ఆంక్షలను ఒ

బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు తర్వాత నగదు విత్‌డ్రాపై పలు రకాల ఆంక్షలు విధించి అమలు చేసింది. ఇపుడు ఈ ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ వస్తోంది. ఇందులోభాగంగా, తాజాగా సేవింగ్స్ ఖాతాదారులకు ఓ శుభవార్త తెలిపింది. 
 
నోట్లరద్దు తర్వాత సేవింగ్స్ ఖాతాలపై విధించిన విత్‌డ్రా పరిమితులను రెండు విడతలుగా ఎత్తివేస్తామని జనవరి 30 ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నుంచి సేవింగ్స్ ఖాతా వినియోగదారులు ఒక్క వారంలో రూ.50 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. వచ్చేనెల 13 నుంచి పరిమితులను పూర్తిగా ఎత్తివేస్తారు. 
 
కాగా, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా... నగదు ఉపసంహరణపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. అనంతరం కరెన్సీ కొరత సద్దుమణిగిన కొద్దీ విడతల వారీగా విత్‌డ్రా పరిమితులను సడలిస్తూ వస్తోంది. జనవరి 30 తర్వాత మాత్రమే సేవింగ్స్ ఖాతాల నుంచి రూ.24 వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
 
మరోవైపు ఏటీఎంల నుంచి కూడా నగదు ఉపసంహరణను క్రమంగా రూ.2 వేల నుంచి రూ.2500, తర్వాత రూ.4500 అనంతరం గతనెల 16 నుంచి రోజుకు రూ.10 వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.