శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (21:26 IST)

తన మల్టీవిటమిన్, ప్రోటీన్ పౌడర్‌ల శ్రేణి కోసం కాజల్ అగర్వాల్‌తో సెంట్రమ్ నూతన క్యాంపెయిన్‌

Kajal
ప్రపంచంలోనే నంబర్ 1 మల్టీవిటమిన్ బ్రాండ్ సెంట్రమ్, భారతదేశంలో తన కొత్త శ్రేణి మల్టీ విటమిన్, ప్రొటీన్‌ల శ్రేణిని విడుదల చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి, ఎంటర్‌ప్యూనర్‌ కాజల్ అగర్వాల్‌ను ప్రకటించింది. పలువురు భారతీయులకు వారి మొత్తం పోషకాహార అవసరాల గురించి తెలియకపోవచ్చు. నిజానికి, 10 మంది భారతీయులలో 8 మంది మల్టీవిటమిన్ లోపంతో సమస్యలు ఎదుర్కొంటూ ఉండేందుకు అవకాశం ఉంది. కాజల్‌తో కలిసి సెంట్రమ్ క్యాంపెయిన్ సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను, పోషకాహార అంతరాలను భర్తీ చేసేందుకు ఆహారంతో పాటు మల్టీవిటమిన్‌లను చేర్చడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సెంట్రమ్ మద్దతుతో కాజల్ తన బహుళ పాత్రలను అంతరాయం లేకుండా నిర్వహించడాన్ని హైలైట్ చేస్తుంది.
 
ఈ భాగస్వామ్యం గురించి నటి కాజల్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, “నటిగా, ఎంటర్‌ప్యూనర్‌గా ఇప్పుడు కొత్తగా తల్లిగా మారిన నేను ప్రతిరోజూ 100కు వంద శాతం ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా నాలాగా బహుళ పాత్రలను పోషిస్తూ జీవితాన్ని కొనసాగించేందుకు, శరీరం, అంతర్గత ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ కొత్త మల్టీవిటమిన్ ప్రోటీన్ పౌడర్‌, గమ్మీస్ శ్రేణి కోసం సెంట్రమ్ వంటి విశ్వసనీయ బ్రాండ్‌తో అనుసంధానం అయినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళల పట్ల నిజంగా శ్రద్ధ వహించే, తమ సొంత ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్‌ను చూడటం హృదయపూర్వకంగా ఉంది. ఈ భాగస్వామ్యంతో, భారతీయ మహిళలు తమ లోపలి ఆరోగ్యాన్ని చూసుకునేలా ప్రేరేపించాలని నేను ఆశిస్తున్నాను. తద్వారా వారు బయట అత్యుత్తమ ప్రకాశవంతంగా ఉంటారు’’ అని వివరించారు.
 
ఈ కొత్త భాగస్వామ్యం గురించి భారత ఉపఖండంలో హేలియన్ మార్కెటింగ్ హెడ్ అనురితా చోప్రా మాట్లాడుతూ, “జీవితంలో పలు రకాల పాత్రలను పోషించడం అనేది కొత్త జీవన విధానం కాగా, మనం పోషించే బహుళ పాత్రలలో రాణించాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. వ్యక్తులు వారి బహుళ-జీవిత పాత్రలకు అవసరమైన రోజువారీ ఆహారంతో పాటు వారి శరీరానికి అవసరమైన మల్టీవిటమిన్‌లను అందించడాన్ని ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ అంశంలో కాజల్ చాలా మందికి ప్రేరణగా ఉంది. నిత్యం వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు భారతీయులను ప్రేరేపించేందుకు సరిగ్గా సరిపోతుంది. మల్టీవిటమిన్‌ల ప్రాముఖ్యతపై భారతీయులకు అవగాహన కల్పించడమే కాకుండా, భారతీయులు శారీరక ఆరోగ్యంతో, బయట ప్రకాశవంతంగా ఉండేలా చేసే ప్రవర్తనా మార్పును కూడా తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము’’ అని వివరించారు.