మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2024 (20:06 IST)

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో రేవంత్ చేతుల మీదుగా హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ ప్రారంభం

image
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలోని బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) ఏర్పాటుచేసిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీని గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి)కి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమాచార, ఐటి, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖల గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు; గౌరవనీయులైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, గౌరవనీయమైన అటవీ & పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రి  శ్రీమతి కొండా సురేఖ, హెచ్‌సిసిబి సీఈఓ శ్రీ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్‌తో పాటు, కంపెనీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు సహా ముఖ్య ప్రముఖులు హాజరయ్యారు. 
 
49 ఎకరాల్లో నిర్మించబడిన ఈ కర్మాగారం మొత్తం రూ. 2,091 కోట్ల (యుఎస్ 251 మిలియన్ డాలర్లు) పెట్టుబడిని కలిగి ఉంది, అందులో రూ. 1,409 కోట్లు (యుఎస్ 170 మిలియన్ డాలర్లు) ప్రస్తుత దశ కోసం ఇప్పటికే ఉపయోగించబడింది. ఈ సదుపాయం 7 అధునాతన ఉత్పత్తి మార్గాలను నిర్వహిస్తుంది, 410 మంది వ్యక్తులకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని కల్పించడానికి సిద్ధంగా ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇప్పటికే ఉన్న కర్మాగారానికి అనుబంధంగా తెలంగాణలో హెచ్‌సిసిబి కి ఇది రెండవ ఫ్యాక్టరీ. ఈ రెండూ కలిసి, రూ. 3,798 కోట్ల (యుఎస్ 455.5 మిలియన్ డాలర్లు) సంయుక్త పెట్టుబడితో, 1,000 మందికి పైగా వ్యక్తులకు ఉపాధితో తెలంగాణలో హెచ్‌సిసిబి యొక్క గణనీయమైన, పెరుగుతున్న ఉనికిని  నొక్కిచెబుతున్నాయి. హెచ్‌సిసిబి రాష్ట్రంలో దాదాపు 1,80,000 మంది రిటైలర్‌ల యొక్క బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, ఆర్థిక వృద్ధికి కీలకమైన డ్రైవర్‌గా దాని పాత్రను మరింత పటిష్టం చేస్తుంది.
 
బండ తిమ్మాపూర్‌లోని కొత్త ఫ్యాక్టరీ అధునాతన సాంకేతికతలు, పర్యావరణ స్పృహతో కూడిన పద్ధతులను ఏకీకృతం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించే ఆటోమేటెడ్ సిస్టమ్‌ల నుండి పునరుత్పాదక శక్తి కార్యక్రమాల వరకు, ఇది దాని పర్యావరణ  ప్రభావాన్ని  తగ్గించడానికి ప్రాధాన్యతనిస్తుంది. పర్యావరణ అనుకూలమైన శీతలీకరణ వ్యవస్థలు, నీటి పునర్వినియోగ పద్ధతులు, క్లీనర్ ఎనర్జీ సొల్యూషన్‌లతో సహా అదనపు చర్యలు, బాధ్యతాయుతంగా నిర్వహించడంలో హెచ్‌సిసిబి యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ కర్మాగారం వ్యాపార వృద్ధిని సంఘం, పర్యావరణ శ్రేయస్సుతో సమలేఖనం చేయడానికి హెచ్‌సిసిబి యొక్క ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది, ఇది ప్రాంతం యొక్క పురోగతికి సానుకూలంగా దోహదపడుతుంది.
 
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "బండ తిమ్మాపూర్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు, ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా వెలుగొందుతున్న తెలంగాణ ఖ్యాతిని నొక్కి చెబుతుంది. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సమగ్ర విధానం అనుసరిస్తున్న హెచ్‌సిసిబిని మేము అభినందిస్తున్నాము. ఇది ఉద్యోగాలను తెస్తుంది, కమ్యూనిటీలను ఉద్ధరిస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది" అని అన్నారు. 
 
గౌరవనీయులైన సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ; పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాలు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ "బండ తిమ్మాపూర్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు పారిశ్రామిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ కలిసి ఎలా సాగుతాయి అనేదానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ తెలంగాణ పారిశ్రామిక ప్రకృతి దృశ్యానికి ప్రధాన జోడింపుగా నిలుస్తుంది మరియు ఈ ప్రాంతం కోసం పర్యావరణ అనుకూల  వృద్ధి మరియు సంపదకు తోడ్పడనుంది"  అని అన్నారు.
 
గౌరవనీయులైన రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “బండ తిమ్మాపూర్‌లోని హెచ్‌సిసిబి గ్రీన్‌ఫీల్డ్ సదుపాయం పారిశ్రామిక పురోగతి మరియు సమాజ అభివృద్ధికి మధ్య ఉన్న సమన్వయానికి ఉదాహరణగా నిలుస్తుంది. నైపుణ్యం కలిగిన ఉపాధిని సృష్టించడం మరియు యువత, మహిళలు మరియు గ్రామీణ వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాలతో ఏకీకృతం చేయడం ద్వారా, ఈ పెట్టుబడి పర్యావరణ అనుకూల మరియు సమ్మిళిత వృద్ధికి కేంద్రంగా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుంది" అని అన్నారు. 
 
గౌరవనీయమైన అటవీ & పర్యావరణ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ మాట్లాడుతూ, “పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఇది గొప్ప ఉదాహరణ. పునరుత్పాదక ఇంధనం, నీటి పునర్వినియోగం వంటి పర్యావరణ అనుకూల సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా, ఈ ఫ్యాక్టరీ తెలంగాణలో పర్యావరణ బాధ్యత కలిగిన తయారీకి ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది" అని అన్నారు. 
 
హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ, "హెచ్‌సిసిబి వృద్ధి ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు మరియు తెలంగాణ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ అత్యాధునిక ఫ్యాక్టరీ అధునాతన తయారీ, పర్యావరణ అనుకూల  సాంకేతికతను మిళితం చేసింది. దీనిని మన పరిశ్రమలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలువుతుంది. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి మరియు పరిశ్రమల శాఖామంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ట్యాపింగ్ పాయింట్ కనెక్షన్ , మిషన్ భగీరథ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపరితల నీటి పైప్‌లైన్‌ను పూర్తి చేయటం మరియు మా ఫ్యాక్టరీ కార్యకలాపాలకు విద్యుత్ లభ్యత కోసం త్వరిత అనుమతిని అందించడం చేశారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ లో మా ఉత్పత్తిని ప్రారంభించటానికి అవి తోడ్పడ్డాయి" అని అన్నారు.