బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (10:17 IST)

శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు - వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు

gas cylinder
జూలై ఒకటో తేదీన చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. నెలవారీ సమీక్షలో భాగంగా, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరను తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య వంటగ్యాస్ ధరను రూ.198 మేరకు తగ్గించింది. దీంతో ఢిల్లీ రూ.2,219 నుంచి రూ.2,021కి పడిపోయింది. 
 
ఈ తాజా తగ్గింపుతో హైదరాబాద్ నగరంలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,426గా ఉంది. అంటే రూ.183.50 తగ్గింది. అలాగే, కోల్‌కతా నగరంలో రూ.182, ముంబైలో 190.5, ఢిల్లీలో రూ.187 మేరకు తగ్గింది. గత నెల ఒకటో తేదీన కూడా రూ.135 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే.