కాంటినెంటల్ టైర్స్ తెలంగాణలో కొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్
కరీంనగర్: ప్రముఖ ప్రీమియం టైర్లు తయారీ సంస్థ కాంటినెంటల్ టైర్స్, తెలంగాణలోని కరీంనగర్‌లో తమ ఫ్లాగ్‌షిప్ కాంటినెంటల్ ప్రీమియం డ్రైవ్ డీలర్‌షిప్(సిపిడి)ని ఆవిష్కరించింది. దక్షిణాదిలో వాహన ప్రియులకు చక్కని ప్రీమియం టైర్ పరిష్కారాలను అందించడంలో కంపెనీ యొక్క స్థిరమైన అంకితభావాన్ని ఈ మైలురాయి నొక్కి చెబుతుంది. ఈ సరికొత్త ఆవిష్కరణ తెలంగాణ ప్రాంత పరిధిలో 10వ సిపిడి స్టోర్ అవుతుంది. కరీంనగర్‌లో ఉన్న ఈ కొత్త డీలర్‌షిప్ 1,900 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఇంకా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ డీలర్‌షిప్ వీల్ అలైన్‌మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, టైర్ మార్చడం, నైట్రోజన్ ఫిల్లింగ్ వంటి అనేక రకాల సేవలను అందిస్తుంది.
కాంటినెంటల్ టైర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్- సెంట్రల్ రీజియన్ ఆసియా-పసిఫిక్ హెడ్ సమీర్ గుప్తా మాట్లాడుతూ, "భారతదేశం కాంటినెంటల్ టైర్‌లకు కీలకమైన వృద్ధి మార్కెట్‌గా కొనసాగుతోంది. మా రిటైల్ ముద్రను విస్తరించడం మా విస్తరణ ప్రస్థానంలో మరో ప్రధాన ముందడుగు. మా ఇన్ ది మార్కెట్, ఫర్ ది మార్కెట్ విధానంతో, దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు ప్రీమియం ఉత్పత్తులను, మెరుగైన అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతను మేము బలోపేతం చేస్తున్నాము.
వారు ఇంకా మాట్లాడుతూ, “కరీంనగర్‌లో కొత్త ప్రారంభంతో, దక్షిణ భారతదేశంలోని ఆటోమోటివ్ కస్టమర్‌లకు అధునాతన టైర్ సొల్యూషన్స్, అత్యుత్తమ సేవా ప్రమాణాలను తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. దక్షిణాది మార్కెట్ వ్యూహాత్మకంగా కాంటినెంటల్ టైర్‌లకు ముఖ్యమైనది, మరియు సమీప భవిష్యత్తులో మరిన్ని సిపిడి స్టోర్‌లను ప్లాన్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మా విస్తరణను వేగవంతం చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము,” అన్నారు.
4 వీల్జ్ అండ్ టైర్స్ యజమాని బద్దం శ్రీనివాస్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "కొత్త కాంటినెంటల్ ప్రీమియం డ్రైవ్ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా కాంటినెంటల్ టైర్స్‌తో మా అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలని మేము ఎదురుచూస్తున్నాము. ఈ కొత్త స్టోర్ ద్వారా, మేము ఒకే చోట వినియోగదారులకు అధిక-నాణ్యత టైర్ సొల్యూషన్స్, నిపుణుల సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కాంటినెంటల్ టైర్ల నూతన ఆవిష్కరణలు, మద్దతుతో బలమైన కస్టమర్ సంబంధాలను ఎర్పరుచుకోవలని మేము ఎదురుచూస్తున్నాము."
కాంటినెంటల్ టైర్స్, “ఇన్ ది మార్కెట్, ఫర్ ది మార్కెట్ విధానాన్ని” లక్ష్యంగా చేసుకుని, దేశవ్యాప్తంగా 200కు పైగా బ్రాండ్ స్టోర్లతో తమ సిపిడి స్టోర్‌ల సర్క్యూట్‌ను విస్తరించడంతో, కస్టమర్లతో సమగ్రంగా బ్రాండ్ పరస్పర సంబంధం ఏర్పడుతుంది.