Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హమ్మయ్య.. క్రెడిట్ కార్డు చెల్లింపులకు నగదు పరిమితి లేదట.. కండిషన్స్ అప్లై

హైదరాబాద్, బుధవారం, 5 జులై 2017 (02:30 IST)

Widgets Magazine

నగదు లావాదేవీలు రెండు లక్షల రూపాయలకు మించకూడదన్న పరిమితులపై కేంద్రం కొన్ని మినహాయింపులను ఇచ్చింది. దీని ప్రకారం క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు నియమించిన బిజినెస్‌ కరస్పాండెంట్ల లావాదేవీలు, ప్రీపెయిడ్‌ సాధనాలు జారీ చేసే సంస్థలకు నగదు పరిమితి ఉండదు. తాజాగా ఆదాయ పన్ను విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నగదు లావాదేవీల పరిమితి నుంచి అయిదు రకాల సంస్థలకు మినహాయింపు లభిస్తుంది.
 
అలాగే, ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్‌ కార్డులకు సంబంధించి రూ.2 లక్షలకు మించి క్రెడిట్‌ కార్డు కంపెనీలకు నగదు రూపంలో చెల్లించవచ్చు. రూ.2 లక్షల పరిమితి అమల్లోకి వచ్చిన ఏప్రిల్‌ 1 నాటి నుంచే తాజా నిబంధన కూడా అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలని జూలై 3 తేదీ నాటి నోటిఫికేషన్‌లో రెవెన్యూ విభాగం పేర్కొంది. నికార్సయిన లావాదేవీలు నిర్వహించే వారికి ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ మినహాయింపులు కల్పిస్తున్నట్లు తెలిపింది. 
 
అలాగే సహకార బ్యాంకు లేదా బ్యాంకు తరఫున నియమితులైన బిజినెస్‌ కరస్పాండెంట్‌ రూ. 2 లక్షలకు మించి నగదు జమ లావాదేవీలు నిర్వహించవచ్చు. సెక్షన్‌ 269ఎస్‌టీ ప్రకారం ఒక్క రోజులో ఒకటి లేదా అంతకు మించిన లావాదేవీలకు సంబంధించి ఏ వ్యక్తీ రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరపరాదు. దీన్ని ఉల్లంఘిస్తే నగదు అందుకున్న వారు 100 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

22 రాష్ట్రాల్లో బోర్డర్ చెక్ పోస్టుల తొలగింపు.. జీఎస్టీతో కమీషన్లూ గోవిందా

దేశంలోని అన్ని రకాల సేవా పన్నులను తొలగించి వాటి స్థానంలో ఏకీకృత పన్ను రూపంలో వస్తు సేవల ...

news

జీఎస్టీతో ఒక్క దేశం కూడా బాగుపడిన దాఖలా లేదు. ఇండియాను ఏం చేయదలిచారు?

ప్రపంచంలో దాదాపు 150 దేశాలు జీఎస్టీ ద్వారా ఆదాయ వనరులు పెంచుకుంటున్నాయని మన పాలకవర్గాల ...

news

రైళ్లలో ఎకానమీ క్లాస్ బోగీలు.. తక్కువ చార్జీలతో ఏసీ ప్రయాణం

రైల్వే ఆధునకీకరణ చర్యల్లో భాగంగా, ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తొలిసారి రైలు ...

news

ఆధార్ ‌- పాన్‌ లింకు తప్పనిసరి... అనుసంధానంపై మరో వెసులుబాటు

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ నంబరు అనుసంధానంపై ఆదాయపు పన్ను విభాగం మరో అవకాశం ...

Widgets Magazine