శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:52 IST)

కరిగిపోతున్న రూపాయి విలువ... 70 ఏళ్లలో చేయలేనిది మోడీ చేసి చూపించారు!

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ కరిగిపోతోంది. ముఖ్యంగా, డాల‌ర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం కూడా మ‌రింత ప‌త‌న‌మైంది. మార్కెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డాల‌ర్‌తో రూపాయి విలువ 70.1గా న‌మోదైంది. ఈ యేడాద

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ కరిగిపోతోంది. ముఖ్యంగా, డాల‌ర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం కూడా మ‌రింత ప‌త‌న‌మైంది. మార్కెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డాల‌ర్‌తో రూపాయి విలువ 70.1గా న‌మోదైంది. ఈ యేడాదిలోనే రూపాయి విలువ 10 శాతం ప‌డిపోవడం గమనార్హం.
 
సోమ‌వారం మార్కెట్ల‌లో రూపాయి విలువ 69.91 వ‌ద్ద నిలిచిపోయింది. అయితే అక్క‌డ నుంచి మొద‌లైన మంగళవారం ఇవాళ ఉద‌యం ఆరంభంలో కొంత మెరుగుప‌డింది. 23 పైస‌లు కోలుకుని 69.28 వ‌ద్ద కొద్ది సేపు నిలిచింది. ట‌ర్కీ క‌రెన్సీ లీరా ప్ర‌కంప‌న‌లు ద‌లాల్ స్ట్రీట్‌ను తాక‌డంతో రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యంలో.. డాల‌ర్ విలువ 70.07గా న‌మోదు అయ్యింది. 
 
డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనీస స్థాయికి పతనమైంది. సోమవారం ఒక్క రోజులోనే రూ.1.10 లేదా 1.57 శాతం నష్టపోయి రూ.69.93 వద్ద ముగిసింది. ఆగస్టు 2103 తర్వాత ఒక రోజులో జరిగిన గరిష్ట పతనం ఇదే కావడం గమనార్హం. అప్పుడు ఒకే రోజు రూ.1.48 లేదా 2.4 శాతం నష్టపోయింది. టర్కీ ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించనుందన్న అంచనాలతో వివిధ దేశాల కరెన్సీలు కూడా పతనమవుతున్న విషయం తెల్సిందే.
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పంచ్ వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టానికి చేరడాన్ని ప్రస్తావిస్తూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయలేనిది మేము చేసి చూపించామని మోడీ తరచూ అంటూ ఉంటారు. సరిగ్గా అదే పాయింట్‌ను పట్టుకొని సమయానుకూలంగా ట్వీట్ చేసింది. మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70ని తాకగా, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాము 70 ఏళ్లలో చేయలేనిది మొత్తానికి మోడీ చేసి చూపించారు అంటూ ట్వీట్ చేసింది. దీనికి కమలనాథులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచిచూడాల్సిందే.