బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 జూన్ 2022 (22:44 IST)

270 ఇళ్లు మొత్తం కొద్ది గంటలలోనే కొనుగోలుదారులు- బ్రోకర్ల నుంచి అనూహ్య స్పందన

photo
ఈ ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారులు, బ్రోకర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. వీరంతా కూడా డాన్యుబ్‌ ప్రోపర్టీస్‌ కార్యాలయం ముందు వరుస కట్టడంతో పాటుగా అది తెరిచిన వెంటనే తమ గుప్తనిధి- కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. వారంతా కూడా తమ కలల ఇంటిని బుక్‌ చేసుకోవడంతో పాటుగా తమ తొలి డిపాజిట్‌ను తొలిరోజే చెల్లించారు. డెలివరీ సమయంలో పూర్తిగా ఫర్నిచర్‌ చేయించుకుని మరీ వారు తమ ఇళ్లను పొందగలరు. డాన్యూబ్‌ గ్రూప్‌ ఇప్పుడు అతి పెద్ద హోమ్‌ ఫర్నిషింగ్‌ నెట్‌వర్క్‌ను నడుపడంతో పాటుగా హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బ్రాండ్‌ డాన్యూబ్‌ హోమ్‌ను సైతం నిర్వహిస్తుంది.

 
‘‘డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ పట్ల కొనుగోలుదారుల విశ్వాసాన్ని ఇది ప్రదర్శిస్తోంది. మా అతిపెద్ద బలం మరియు ప్రేరణగా వేగంగా వృద్ధి చెందుతున్న యుఎఈ నివాసితులలో మా వినియోగదారుల సంఖ్య. వీరికి మేము మా వాగ్ధానాలను నెరవేర్చుతుండటం కూడా అదే రీతిలో పెరుగుతుంది’’ అని డాన్యూబ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ శ్రీ రిజ్వాన్‌ సాజన్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ ఇది ఎనిమిది నెలల కాలంలో మా మూడవ ప్రాజెక్ట్‌.  అదీ వెంటనే విక్రయించబడటం సానుకూల మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రదర్శిస్తుంది. అంతేకాదు మరింత మంది కొనుగోలుదారులు ప్రోపర్టీ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నారని కూడా వెల్లడిస్తుంది’’ అని అన్నారు.
 
‘‘ఓ డెవలపర్‌గా, తాము స్ధిరంగా వినియోగదారులకు వాగ్ధానాలను డెలివరీ చేస్తున్నాము. ఇప్పటి వరకూ 17 ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తే వాటిలో 11 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేశాము. ఇప్పటి వరకూ అత్యధిక ఆవిష్కరణ లతో సరిపోల్చినప్పుడు డెలివరీ రేషియో ఇది. ఇది కొనుగోలుదారులు, బ్రోకర్లు,  మదుపరులకు మా ప్రోపర్టీల పట్ల ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. యూనిట్ల సంఖ్య పరంగా ఇప్పటి వరకూ 8,272 యూనిట్లను విక్రయించగావాటిలో 4556 యూనిట్లను డెలివరీ చేసింది. విలువ పరంగా మేము 3.63 బిలియన్‌ దీరామ్‌ విలువైన ఇళ్లను వినియోగదారులకు అందించాము. మొత్తంమ్మీద ఈ ఆస్తుల మొత్తం విలువ 5.65 బిలియన్‌ దీరామ్‌లుగా ఉండనుంది’’ అని అన్నారు.
 
ఈ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రాజెక్ట్‌ జెమ్జ్‌  270 అత్యున్నతంగా డిజైన్‌ చేసిన అపార్ట్‌మెంట్లను 30 విలాసవంతమైన సౌకర్యాలతో అందిస్తుంది. డాన్యూబ్‌ ప్రోపర్టీస్‌ యొక్క ట్రెండ్‌ సెట్టింగ్‌ 1 % నెలవారీ చెల్లింపు ప్రణాళిక అత్యంత అందుబాటు ధరలో విలాసంగా 5,50,000 దీరామ్స్‌ ప్రారంభ ధరతో అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను  5,30,000 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియా కలిగిన ఈ ప్రాజెక్ట్‌లో  101,000 చదరపు అడుగుల ప్లాట్‌ ఏరియా అభివృద్ధి చేశారు. ఈ 14 అంతస్తుల ప్రాజెక్ట్‌లో  274 అపార్ట్‌మెంట్లు ఉండనున్నాయి. వీటిలో 74 1బీహెచ్‌కె, 24 స్టూడయో, 114 2బీఎచ్‌కె మరియు 42 3 బీహెచ్‌కె మరియు 16 అపార్ట్‌మెంట్‌లు డూప్లెక్స్‌ రూపంలో ఉంటాయి.