గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (14:49 IST)

డీజిల్ డిమాండ్ పెరిగింది.. పెట్రోల్‌కు డిమాండ్

petrol
డీజిల్ డిమాండ్ పెరిగింది.. పెట్రోల్‌కు డిమాండ్ పెరిగింది. ఇందుకు కారణం ఏంటంటే.. ఎలక్ట్రిక్ లేదా బయోడీజిల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ చక్రం పెట్రోల్- డీజిల్‌పైనే తిరుగుతోంది. 
 
దేశంలో కార్ బైక్- బస్సు- ట్రాక్టర్- రైలు లేదా జనరేటర్ ఇలా ప్రతీ వాటికీ ఉపయోగించే మొత్తం ఇంధనంలో డీజిల్ 40 శాతం మాత్రమే. కానీ జూన్ నెలలో దాని డిమాండ్‌లో విపరీతమైన క్షీణత కనిపించింది. దీనికి విరుద్ధంగా పెట్రోల్ డిమాండ్ పెరిగింది. 
 
జూన్‌లో డీజిల్ డిమాండ్ 3.7 శాతం తగ్గి కేవలం 7.1 మిలియన్ టన్నులకు చేరుకోగా, పెట్రోల్ డిమాండ్ 3.4 శాతం పెరిగి 2.9 మిలియన్ టన్నులకు చేరుకుంది. నెలవారీగా మే నెలలో డీజిల్ విక్రయం 70.9 లక్షల టన్నులుగా ఉండగా, జూన్‌లో పెట్రోల్‌కు డిమాండ్ దాదాపు అదేస్థాయిలో వుంది.