శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (11:34 IST)

దేశంలో వంట గ్యాస్ మంటలు... ఒక్కసారిగా పెరిగిన ధరలు

దేశంలో వంట గ్యాస్ మంటలు చెలరేగాయి. గత కొన్ని నెలలపాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన వంట గ్యాస్ ధరలు జూన్ ఒకటో తేదీన ఒక్కసారిగా పెరిగాయి. ఈ పెరుగుదల కనిష్టంగా రూ.11.50గాను, గరిష్టంగా రూ.37 వరకు ఉంది. 
 
జాన్ నెల ధరల మేరకు సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై సోమవారం మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. ఈ పెరిగిన ధరలు జూన్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. కోల్‌కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగింది.
 
14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో మే 31వ తేదీ నాటికి ధర రూ.581.50 ఉండగా, జూన్ ఒకటో తేదీన ధర రూ.593కి చేరింది. కోల్‌కతాలో ఆదివారం ధర రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో మే 31 వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో ఆదివారం ధరం రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది.