శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (10:02 IST)

రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీరు.. రూపాయికి ఒక గ్లాసు మంచి నీరు

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే అందుబాటులో తేనుంది ఐఆర్సీటీసీ. ఇందులో భాగంగా రూపాయికే ఒక గ్లాసు మంచీనీరు అందించనుంది. 300 ఎంఎల్‌ను రూపాయికి... 500 ఎ

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే అందుబాటులో తేనుంది ఐఆర్సీటీసీ. ఇందులో భాగంగా రూపాయికే ఒక గ్లాసు మంచీనీరు అందించనుంది. 300 ఎంఎల్‌ను రూపాయికి... 500 ఎంఎల్ రూ. 3కు, లీటరు నీరు రూ. 5కు, రెండు లీటర్లను రూ. 8కి విక్రయించనున్నట్టు పేర్కొంది.
 
ఇక రైల్వే ప్రయాణీకులకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు గాను మొత్తం 1,100 వాటర్ వెండింగ్ మెషీన్లను దాదాపు 450 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ తెలిపింది. వెండింగ్ మిషీన్ల ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని ప్రయాణీకులకు అందించడంతో పాటు 2వేల మంది ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుందని... ఇప్పటికే 345 స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషీన్లు ఉన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది.