గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 22 మే 2020 (22:54 IST)

డ్రూమ్ 'సి-కామర్స్' ఇంటి ముంగిటే టెస్ట్ డ్రైవ్

కొనసాగుతున్న కోవిడ్-19 అంటువ్యాధిని ఎదుర్కోవటానికి, డ్రూమ్ ఇటీవల తన కొత్త సి-కామర్స్ సేవలను ఆవిష్కరించింది. దీనిని భారతదేశమంతటా ప్రారంభించినందున, అధిక సంక్రమణ నిండిన వైరస్ నుండి సమాజాన్ని సంరక్షించడానికి, సామాజిక దూర మార్గదర్శకాలను సమర్థించటానికి, డ్రూమ్, తన కాంటాక్ట్-లెస్ సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది. 
 
ఈ ప్రయత్నంలో భాగంగా, డ్రూమ్, తన వినియోగదారులకు, తనని సమగ్ర సాధనాలైన డ్రూమ్ డిస్కవరీ, ఓబివి, డ్రూమ్ హిస్టరీ మరియు ఎకో తనిఖీ ద్వారా ఆన్‌లైన్‌లో నిశితమైన వాహన తనిఖీని చేయడానికి వీలుకల్పిస్తుంది. దీనిని అనుసరిస్తూ, డోర్ స్టెప్ టెస్ట్ డ్రైవ్ మరియు ఇంటి ముంగిటే వాహన ధృవీకరణతో పాటుగా, హోమ్ డెలివరీ లేదా హోమ్ లేదా పనిప్రదేశం వద్దకు విక్రయ సౌలభ్యం సేవలను అందిస్తోంది. ఇంకా, డ్రూమ్, పూర్తి ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులు మరియు ఆటోమేటెడ్ ఆర్‌సి రిజిస్ట్రేషన్, ఆర్‌సి బదిలీ మరియు లావాదేవీల క్లోజర్ ను కూడా అమలు చేస్తోంది.
 
డ్రూమ్ వారు, ఈ నూతన ఉపక్రమం క్రింద, డ్రూమ్ ఇప్పటికే వివిధ నగరాల నుండి జాబితా చేయబడిన జింఎంవిలలో మరియు వేలకొలదీ డీలర్స్ మరియు వ్యక్తిగత విక్రయదారుల నుండి, రూ. 10,000 కోట్ల రూపాయల విలువగల 1.25 లక్షలకు పైగా కొత్త జాబితాలను అందుకుంది.
 
ఈ అభివృద్ధిపై డ్రూమ్ వ్యవస్థాపకుడు అండ్ సిఇఒ సందీప్ అగర్వాల్ మాట్లాడుతూ, “100 సంవత్సరాల ప్రీ-ఓన్డ్ ఆటోమొబైల్ క్లాసిఫైడ్స్ విభాగాన్ని ఆన్‌లైన్ ఎండ్‌-టు-ఎండ్ కామర్స్ లావాదేవీల విభాగంగా మార్చడానికి డ్రూమ్ గత 6 సంవత్సరాలు సమయాన్ని వెచ్చించింది మరియు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఈ సమయంలో, మేము, సాంకేతికత మరియు వినియోగదారు అనుభవాల యొక్క అత్యంత అభివృద్ధిని సాధించడమే కాకుండా, 500 వేలకు పైగా వాహనాలను విక్రయించాము.
 
తత్సమానమైన ఋణాలు, బీమా సౌకర్యం, మరమ్మత్తు, తనిఖీ మొదలైనవాటిని అందించాము, అది కూడా 100% స్వచ్ఛమైన రంగ ఆన్‌లైన్ విభాగంలో అందించాము. కోవిడ్-19 మహమ్మారి, వినియోగదారుల మనోభావాలలో మార్చలేని పరివర్తనకు దారితీసింది. మా అధిక-నాణ్యత పూర్తిగా ఆన్‌లైన్ మరియు కాంటాక్ట్‌లెస్ సేవలు వినియోగదారుల అవసరాలను సమర్ధవంతంగా తీర్చడంలో ఈ నమూనా మార్పును ఉపయోగించుకోవడానికి మాకు వీలుకల్పిస్తాయి.”
డ్రూమ్ తన వినియోగదారుల వ్యాప్తి మరియు సంరక్షణ కోసం ఇటీవలే అనేక వినూత్న సేవలను ప్రవేశపెట్టింది.
 
ఇది ఇటీవలే, జెర్మ్ షీల్డ్ సేవను ప్రారంభించింది, ఇది నిరూపిత యాంటీమైక్రోబయల్ పూతతో వాహన ఉపరితలాలను కలుషితరహితంగా చేయడమే లక్ష్యాన్ని కలిగి ఉంది, ఇది 3 నెలలపాటు ప్రభావవంతంగా ఉంటుంది, 99.99% క్రిములను నాశనం చేయగలదు. నగరంలోని ప్రధాన యోధుల భద్రతను నిర్ధారించడానికి, గురుగ్రామ్ పోలీసుల కోసం ఇది ఒక పారిశుద్ద్య డ్రైవ్‌ను విస్తరించింది. డ్రూమ్, లాక్ డౌన్ అనంతరం తన సాంకేతికత-సక్రియ ఇంటి ముంగిటి వాహనాల సేవ ద్వారా, తన ఎకో వేదికను అందిస్తోంది.