గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:45 IST)

కోడిగుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి.. ఎందుకంటే?

eggs
ఇప్పటికే కూరగాయలు, నూనె ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇది వరకు రూ.5 ఉండేది, తర్వాత రూ.6 అయ్యింది.. ఇప్పుడు రూ.7 అయ్యింది. ప్రతి నెలా ధర పెరిగిపోతోంది. 
 
దీంతో వినియోగదారులు కోడిగుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి వస్తోంది. కొంతమంది గుడ్లు కొనాలా, చికెన్ కొనాలా అని ఆలోచిస్తున్నారు. 
 
రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలలో ఉండటంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. అందువల్ల సహజంగానే గుడ్ల సప్లై తక్కువగా ఉంది. కోళ్లకు ఉపయోగించే దాణా, కరెంటు, మెయింటెనెన్స్, రవాణా ఛార్జీలు కూడా బాగా పెరిగాయి. దీంతో కోడిగుడ్ల ధరలు కూడా పెరిగిపోయాయి.