గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:51 IST)

మోటార్ సైకిల్ కేవలం 19,990కే... మైలేజ్ 65కిలోమీటర్లు.. నిజమా?

ఓ వైపు చమురు సంస్థలు ప్రతి పక్షం రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర ఏడు పదుల రూపాయలు దాటిపోయింది. ఈ ధరల పెరుగుదల సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయిం

ఓ వైపు చమురు సంస్థలు ప్రతి పక్షం రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర ఏడు పదుల రూపాయలు దాటిపోయింది. ఈ ధరల పెరుగుదల సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయింది. అలాంటి వారి కోసం హీరో కంపెనీ ఒక మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చింది. ఆశ్చర్యంగా ఉంది కదూ మోటార్ సైకిల్ అంటే 60వేల పైనే ఉంటుంది. అది కూడా మైలేజ్ 50కి మించితే గొప్పే. అలాంటిది ఈ హీరో మోటార్ సైకిల్ 65 కిలోమీటర్లు రావడం ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి..
 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ స్కూటర్, బైకుల తయారీ రంగంలో ముందుంజలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ దేశీయంగా చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఈ స్కూటర్ పేరు ఫ్లాష్ అని తెలుపుతూ దీని ప్రారంభ ధర రూ.19,990 అని ఎక్స్ షోరూం ఢిల్లీగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
 
ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిదారు హీరో ఎలక్ట్రిక్ మాట్లాడుతూ... 65 కిలోమీటర్ల పాటు ఏకధాటిగా ప్రయాణించే ఈ స్కూటర్‌ను ఒక్కసారిగా ఆరు నుంచి 8 గంటల పాటు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో 48వోల్ట్స్, 20ఏ హెచ్ విఆర్ ఎల్ ఎ బ్యాటరీ అనుసంధానం గల 250వాట్ సామర్ధ్యం గల మోటార్ కలదు. ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉంది. స్కూటర్ బరువు 87కిలోలుగా ఉంది. 
 
రెండు చక్రాలకు కూడా డ్రమ్ బ్రేక్ లను అందించారు. తయారీ దారుడు ఈ స్కూటర్ కు రెండేళ్ళపాటు వారంటిని కల్పిస్తోంది. భద్రత కోసం రైడింగ్ లో ఉన్న ప్రమాదం జరిగితే షార్ట్‌ సర్క్యూట్ నివారణ ఫీచర్ ను ఇందులో పరిచయం చేశారట. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజీతో లభిస్తోంది. వినియోగదారులు దీనిని బర్గుండి మరియు సిల్వర్ అనే రెండు రంగుల్లో ఎంపిక చేసుకోవచ్చట.