శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 5 ఆగస్టు 2024 (23:23 IST)

విరాట్ కోహ్లీతో సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టిన Essilor

virat kohli
ఈ సరికొత్త ప్రచారంలో సింగిల్ విజన్ వినియోగదారుల కోసం Eyezen, మరియు ప్రగతిశీల వినియోగదారుల కోసం Varilux యొక్క ప్రత్యేకమైన మరియు ఉన్నతమైన ప్రయోజనాలను ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రిస్కిప్షన్ లెన్సెస్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేది Essilor. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మోడల్స్ అందించిన ఈ అత్యుత్తమ బ్రాండ్ ఇప్పుడు.. తమ సరికొత్త క్యాంపెయిన్ ని మొదలుపెట్టింది. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఈ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టారు. ఈ క్యాంపెయిన్ ద్వారా బ్రాండ్ పొజిషనింగ్ ను మరింత బలోపేతం చేయడంతో పాటు దృష్టి సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను Essilor ఎలా అందిస్తుంది అనేది ప్రధానంగా హైలెట్ చేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అత్యుత్తమ ఉత్పత్తులను అందించింది వినియోగదారులకు కనెక్ట్ అవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది Essilor.
 
ఇక క్యాంపెయిన్ విషయానికి వస్తే...  క్యాంపెయిన్ మొదటి దశలో ప్రధానంగా సింగిల్ విజన్ లెన్స్‌లు ఉపయోగించే వారిపై ఫోకస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అలా సింగిల్ విజన్ లెన్స్‌లు ఉపయోగించే వారికోసం Eyezen ఉపయోగిస్తారు. Essilor సింగిల్ విజన్ లెన్స్‌‌లు, డిజిటల్ పరికరాలను ఎక్కువ కాలం ఉపయోగించే వ్యక్తుల కోసం ఈ మోడల్‌ని స్పాట్‌లైట్ చేస్తుంది. ఈ క్యాంపెయిన్‌లో ప్రధానంగా ఎక్కువ గంటలు డిజిటల్ పరికరాలను ఉపయోగించే వ్యక్తులు, కంటి ఒత్తిడి, అలసటను ఎదుర్కొంటున్న అనేక దృశ్యాలను ఇది ఆవిష్కరిస్తుంది. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా Eyezen లెన్స్ లను స్వయంగా ఉపయోగిస్తాడు. అందుకే దీనియొక్క ప్రయోజనాలను వివరిస్తూ, అవి డిజిటల్ స్క్రీన్‌ల నుంచి వచ్చే వెలుగుల నుంచి కంటి పై ఒత్తిడిని ఎలా తట్టుకోవాలని, అలాగే బ్లూ-వైలెట్ లైట్‌ను ఫిల్టర్ చేయడానికి ఎలా రూపొందించబడ్డాయో వివరించారు. ఇది కళ్లకు విశ్రాంతిని మరియు రక్షణను అందిస్తుంది.
 
ప్రేస్బియోపియాతో బాధపడుతున్న వారి దృష్టి సమస్యలను సరిచేయడానికి Essilor ఉపయోగించే ప్రోగ్రెసివ్ లెన్స్ ని Varilux అంటారు. క్యాంపెయిన్‌లో రెండో దశలో దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇందులో విరాట్ కోహ్లిని సువార్తికుడుగా మరియు Varilux కోసం వాదించే వ్యక్తిగా చూపించారు. కోహ్లి యొక్క కోచ్ ఇబ్బందులను నివారించడానికి మరియు మెరుగైన దృష్టిని కలిగి ఉండటానికి Varilux లెన్స్‌ లను ప్రయత్నించమని సూచిస్తాడు. ఈ క్యాంపెయిన్ AI సాంకేతికతను మరియు Varilux ప్రోగ్రెసివ్ లెన్స్‌ ల సహాయంతో ప్రెస్బియోపియాను సరిచేసే శాస్త్రీయ విధానాన్ని హైలైట్ చేస్తుంది.
 
ఈ సందర్భంగా Essilor Luxottica దక్షిణాసియా అధ్యక్షుడు శ్రీ నరసింహన్ నారాయణన్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “Essilorలో, గ్లోబల్ స్పోర్ట్స్ దిగ్గజం విరాట్ కోహ్లితో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం మరియు మా వినియోగదారుల కోసం కొత్త మరియు ఉత్తేజకరమైన అధ్యాయాన్ని ఆవిష్కరించడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మా అత్యాధునిక సాంకేతికతలు Eyezen మరియు Varilux వంటి అత్యున్నతమైన ఉత్పత్తులను కనుగొన్నాయి. తద్వారా అన్ని వయసుల వారికి స్పష్టమైన మరియు ఆరోగ్యకరమైన దృష్టి గురించి అవగాహన కల్పించడం మా లక్ష్యాన్ని మేము సాధించినవారం అవుతున్నాం అని అన్నారు ఆయన.
 
ఈ సందర్బంగా విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. “నేను Eyezen వాడుతున్న వ్యక్తిని. ఈ లెన్స్‌ లు అందించే అపారమైన విశ్రాంతి మరియు రక్షణను ప్రేమిస్తున్నాను. Essilor ప్రపంచవ్యాప్తంగా విజన్ కేర్‌ను విప్లవాత్మకంగా మార్చడంలో అగ్రగామిగా ఉంది. వారి వినూత్న ఉత్పత్తుల గురించి మరియు వ్యక్తిగత దృష్టి సంరక్షణ అవసరాలను తీర్చడానికి ప్రతి లెన్స్ ఎలా రూపొందించబడిందో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను"అని అన్నారు ఆయన.