శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (10:21 IST)

ఫ్లిప్‌కార్ట్‌లో 90 శాతం డిస్కౌంట్స్‌... ఫెస్టివల్ బిగ్ ఆఫర్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ బిగ్ ఆఫర్ పేరుతో 90 శాతం మేరకు డిస్కౌంట్స్ ఇవ్వనున్నారు. ఈనెల 20 నుంచి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు తన నాలుగో ఎడిషన్‌ ది బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌ను ప్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ బిగ్ ఆఫర్ పేరుతో 90 శాతం మేరకు డిస్కౌంట్స్ ఇవ్వనున్నారు. ఈనెల 20 నుంచి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు తన నాలుగో ఎడిషన్‌ ది బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌ను ప్రారంభించ‌బోతోంది. ఇందులోభాగంగా, తాము విక్ర‌యించే అన్ని కేటగిరీల్లోని ఉత్పత్తులపై ఇప్ప‌టివ‌ర‌కూ అందించ‌ని విధంగా బెస్ట్‌ డీల్స్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. 
 
సెలెక్ట్ చేసిన వస్తు విక్రయాలపై 90 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తామ‌ని తెలిపింది. 80 ప్లస్‌ కేటగిరీల్లో ఎక్స్‌క్లూజివ్‌ సెలక్షన్‌, దిగ్గజ బ్రాండులతో ఎక్స్‌క్లూజివ్‌ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు, అలాగే టీవీ, రేడియో, సోషల్‌ మీడియా, అవుట్‌డోర్స్‌, డిజిటల్‌ మీడియా వంటి వాటిల్లో ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ గురించి తాము మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ను కూడా నిర్వ‌హిస్తామ‌ని ప్రకటించింది.