1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

వన్స్ మోర్.. బాదుడే బాదుడు... మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వీటి ధరల పెంపు జోలికి వెళ్లని ప్రభుత్వ చమురు కంపెనీలు ఇపుడు మళ్లీ బాదుడు మొదలుపెట్టాయి. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో వీటి ధరలు సెంచరీ దాటిపోయింది. 
 
గురువారం మరోమారు పెట్రోల్, డీజల్ ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు, డీజల్‌పై 87 పైసలు చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.115.42 పైసలకు చేరుకుంది. అలాగే, డీజల్ ధర రూ.101.58 పైసలకు చేరుకుంది. 
 
గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.117.32 పైసలుగా ఉండగా, డీజల్ ధర రూ.103.10గా ఉంది. దక్షిణాదిలోని రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజల్ ధరలు అత్యధికంగా ఉండటం గమనార్హం.