గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2022 (14:06 IST)

ప్రపంచ కుబేరుల జాబితా : టాప్-3లోకి గౌతం ఆదానీ

Adani
ప్రపంచ కుబేరుల జాబితా తాజాగా వెల్లడైంది. ఇందులో భారత పారిశ్రామికవేత్త గౌతం ఆదానీ మూడో స్థానంలో నిలిచారు. టాప్-3లో చోటు దక్కించుకని తొలి ఆసియా వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన ఆస్తి 11 లక్షల కోట్లకు పెరిగినట్టు బ్లాంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. 
 
సోమవారానికి ఆదానీ కుటుంబ ఆస్తి మొత్తం 112 కోట్ల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ.8960 కోట్లు పెరిగి. రూ.13740 కోట్ల డాలర్లు అంటే రూ.10.99 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఆయన టాప్-3లోకి దూసుకొచ్చారు. ఈ స్థానంలో ఇప్పటివరకు ఉన్న లూయీ విట్టోన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నో సంపద రూ.137 కోట్ల డాలర్లు తగ్గి రూ.13,600 కోట్ల డాలర్లకు పడిపోయింది. 
 
ఈ జాబితాలో ఆదానీ నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకోగా, ఆర్నో మూడు నుంచి నాలుగో స్థానానికి జారుకున్నారు. వీరిద్దరి స్థానాలే తారుమారయ్యాయి. ప్రస్తుతం టెస్లా చీఫ్ అధిపతి ఎలాన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌లు మాత్రమే ఆదానీ కంటే ముందు వరుసలో ఉన్నారు. 25,100 కోట్ల డాలర్ల ఆస్తితో మస్క్ ప్రపంచ నంబర్ వన్‌ స్థానంలో కొనసాగుతుండగా బెజోస్ 15,300 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.