మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (20:31 IST)

వర్షాకాలంలో దగ్గు జలుబు: ఉపశమనం కోసం అనుసరించే తమ ఫ్యామిలీ రహస్యాన్ని వెల్లడించిన జెనీలియా

మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే చిరు జల్లుల కాలం వర్షాకాలం అని చాలామంది భావన. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తుంటారు. చిన్నారులు మొదలు వయసు మళ్లిన వారి వరకూ ప్రతి ఒక్కరికీ తమ దైన సొంత వర్షాకాలపు వినోదం ఉండే ఉంటుంది. ఈ కాలంలో ఏం చేయాలోనంటూ ముందుగానే ప్రణాళికనూ చేసుకుంటారు.
 
వర్షాకాలం తమతో పాటుగా తీసుకువచ్చే వినోదం మాత్రమే కాదు, దానితో పాటుగా వచ్చే జలుబు, దగ్గు లక్షణాలు కూడా ఈ సీజన్‌లో అతి సహజంగా కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో మరింత ఆప్రమప్తతతో ఉండటంతో పాటుగా తమ శ్వాసకోశ ఆరోగ్యం పట్ల కూడా అమిత శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకతనూ వెల్లడిస్తుంది. అదే సమయంలో ఇంటిలో అనుసరించే అతి చిన్న చిట్కాల ద్వారా కూడా ఉపశమనం పొందగలరని కూడా ఈ సీజన్‌ వెల్లడిస్తుంది.
 
వినోదం, ఆరోగ్యం సమతుల్యం చేయడంలో ప్రతిభావంతురాలైన నటి, మాతృమూర్తి జెనీలియా దేశ్‌ముఖ్‌ పరిచితమే. అంతేకాదు, పలు సందర్భాలలో దేశ్‌ముఖ్‌ యొక్క కుటుంబ ఆరోగ్యం కాపాడటానికి తనదైన ప్రయత్నాలను చేస్తుంటారు. వర్షాకాలం పూర్తిగా వచ్చేయడంతో, జెనీలియా ఇప్పుడు అతి సరళమైన ఇంటి చిట్కాలపై ఆధారపడటంతో పాటుగా ఇంటి వద్దనే ఉండి వర్షాకాలపు వినోదాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తూనే వారి ఆరోగ్యాన్నీ కాపాడుతున్నారు. తమ కుటుంబ ఆరోగ్యం తమ రోజును యోగా మరియు డీప్‌ బ్రీతింగ్‌ వ్యాయామాలతో ఆరంభిస్తుందనే భరోసా కలిగి ఉన్నారామె. ఈ యోగా తరువాత, సీజనల్‌ ఫ్రూట్స్‌, కూరగాయలతో ఆరోగ్యవంతమైన ఆహారం మాత్రమే తీసుకునేలా ఆమె చర్యలు తీసుకుంటుంటారు. అవసరమైన విటమిన్స్‌ కలిగి ఉండే ఈ పదార్థాలు రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి.
 
తన వర్షాకాల ఆరోగ్య ప్రక్రియ గురించి జెనీలియా మాట్లాడుతూ, ‘‘మా కుటుంబంలో ఔట్‌డోర్‌ కార్యకలాపాలను అమితంగా ఇష్టపడుతుంటాం. వర్షాకాలంలో  ఇది మరింత ఎక్కువ. అయితే, ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వర్షాకాలంలో వారిని జాగ్రత్తగా చూసుకోవడం మరీ ముఖ్యంగా పనుల కోసం తరచుగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వారి యోగక్షేమాలు చూసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అందువల్ల, నేను మా కుటుంబం ఈ కాలంలో యోగా, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం వంటివి అనుసరించేలా జాగ్రత్త పడుతుంటాను. ఒకవేళ దగ్గు, జలుబు లక్షణాలు కనబడితే, విక్స్‌ వాపోరబ్‌తో స్టీమ్‌ ఇన్‌హేలషన్‌తో ఉపశమనం పొందేలా చేస్తుంటాను’’ అని అన్నారు.
 
ఆమెనే మరింతగా మాట్లాడుతూ, ‘‘ సంప్రదాయ ఇంటి చిట్కాల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజానికి నేను ఎక్కువగా అనుసరించేది, తరతరాలుగా మా ఇంటిలో ఎక్కువగా పాటించేది కూడా ఈ చిట్కాలనే !  మరిగించకుండా, ఓ గిన్నెడు వేడి నీటిలో ఓ టీ స్పూన్‌ విక్స్‌ వాపోరబ్‌ వేసి, మన తలను పూర్తిగా కప్పి వేసేలా ఓ టవల్‌ను చుట్టుకుని విక్స్‌ వాపోరబ్‌ ఆవిరిలను తీసుకోవడంతో పాటుగా చక్కటి విశ్రాంతి తీసుకోవడం  చేస్తుంటాం. వీటితో పాటుగా యూకలిప్టస్‌, కర్పూరం, పుదీనా, మెంథాల్‌ వంటి సహజసిద్ధమైన పదార్థాలు కూడా వాడుతుంటాం. విక్స్‌ వాపోరబ్‌తో దగ్గు, జలుబు లాంటి లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. నేను వ్యక్తిగతంగా ఈ విషయాన్ని నమ్ముతుంటాను’’అని అన్నారు.
 
ఆరు సంవత్సరాలు మరియు ఆ పైన వయసు కలిగిన పెద్దలకు విక్స్‌ వాపోరబ్‌ స్టీమ్‌ ఇన్‌హేలేషన్‌ తీసుకోవడం సురక్షితమైన ప్రక్రియ. అయితే, ఒకవేళ లక్షణాలు తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.
 
సూచన: ఎల్లప్పుడూ లేబుల్‌ చదవండి.ఒకవేళ లక్షణాలు తగ్గకపోతే, డాక్టర్‌ను సంప్రదించండి. నొప్పి సంబంధిత లక్షణాల కోసం, ప్రభావిత ప్రాంతాలలో రాయండి.