శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (17:29 IST)

అంతర్జాతీయ విద్య కోసం తెలంగాణ- ఏపీ నుండి 100 మిలియన్ డాలర్ల చెల్లింపులను లక్ష్యంగా పెట్టుకున్న గ్లోబల్ క్రాస్-బోర్డర్ ఫిన్‌టెక్ HiWi

students
అంతర్జాతీయ విద్యను అభ్యసించాలనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్లోబల్ క్రాస్-బోర్డర్ ఫిన్‌టెక్ వేదిక HiWi తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు 2023 సంవత్సరంలో 100 మిలియన్ డాలర్ల సౌకర్యవంతమైన చెల్లింపు సేవలతో మద్దతు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఈ ప్రాంతం నుండి 5000 మంది విద్యార్థులను తమ వేదిక పైకి తీసుకురావటానికి సంస్థ ప్రణాళికలు చేసింది మరియు విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు కోసం మొత్తమ్మీద విదేశీ విద్య అనుభవాలను అందించనుంది. 
 
ఈ రాష్ట్రాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు USAలోని విశ్వవిద్యాలయాలకు నమోదు చేసుకున్నారు, వీరిలోనూ అత్యధికులు MS కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ విద్యార్థులు విద్యపై సగటున USD 20,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అదే మొత్తంలో అక్కడ నివాసం తదితరాల కోసం ఖర్చుచేస్తున్నారు. అయినప్పటికీ, విద్యార్థులు మరియు వారి కుటుంబాలు తరచుగా విదేశీ చెల్లింపుల పరంగా చిక్కులు ఎదుర్కోవటంతో పాటుగా, విదేశాలలో విద్యకు నిధులు సమకూర్చే గజిబిజి ప్రక్రియ మరియు సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు విధించే అధిక విదేశీ మారకపు మార్జిన్‌ల గురించి సవాళ్లనూ ఎదుర్కొంటున్నారు. 
 
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల ప్రత్యేక అవసరాలను తీర్చాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా, HiWi ఈ క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి 2000 మందికి పైగా విద్యా సలహాదారులతో కలిసి ప్లాట్‌ఫారమ్‌లోకి విద్యార్థులను సమర్ధవంతంగా ఆన్‌బోర్డ్ చేయడానికి, వారి ఆర్థిక ప్రయాణాన్ని పర్యవేక్షించడానికి, ఫీజు షెడ్యూల్‌లు మరియు రుసుము చెల్లింపుల కోసం సకాలంలో రిమైండర్‌లను  చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ విద్యను కోరుకునే ప్రాంతంలోని ప్రతి విద్యార్థి తమ వినియోగదారు-స్నేహపూర్వక పరిష్కారాలు మరియు మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందగలరని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
HiWi అందిస్తున్న ఆఫర్‌ల శ్రేణితో, విద్యార్థులు సజావుగా డబ్బును చెల్లించవచ్చు, విదేశీ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేసుకోవచ్చు, వివిధ ఫైనాన్స్ అవకాశాలను పొందటం చేయవచ్చు, కార్డ్ ఖర్చులను ట్రాక్ చేయవచ్చు, లాయల్టీ పాయింట్‌లను సేకరించవచ్చు మరియు నియంత్రణ మార్గదర్శకాల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందవచ్చు. ప్రధాన ప్రాంతాలలో బ్యాంకింగ్ సంస్థలతో ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాలు అధిక నగదు నిర్వహణ మరియు అధిక విదేశీ మారకపు ఫీజులకు సంబంధించిన ఆందోళనల నుంచి ఉపశమనం అందిస్తాయి, విద్యార్థులకు అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన కరెన్సీ నిర్వహణ పరిష్కారాన్ని అందిస్తాయి.
 
HiWi కోఫౌండర్ & సీఈఓ గీతా చౌహాన్ మాట్లాడుతూ, “భారతీయ విద్యార్థులకు ఆకాంక్షలు అధికంగా వున్నాయి. HiWi ఈ విద్యార్థుల కలలను అర్థం చేసుకుంటుంది మరియు వారి లక్ష్యాలను సాధించడంలో వారికి మద్దతునిస్తూ కాంతి రేఖగా ఉండాలని కోరుకుంటుంది. వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా మాకు తెలుసు, ఈ కారణం చేతనే వారి ఆర్థిక ప్రయాణాన్ని సరళీకృతం చేయడమే కాకుండా కొత్త దేశంలో జీవితాన్ని నావిగేట్ చేయడానికి వారికి అవసరమైన సాధనాలను అందించడం ద్వారా అన్ని అవరోధాలను తొలగించడానికి కృషి చేస్తున్నాము. మా ప్లాట్‌ఫారమ్ సౌకర్యవంతమైన నగదు బదిలీని నిర్ధారిస్తుంది మరియు విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి సహాయపడుతుంది, వారి అంతర్జాతీయ విద్యా అనుభవాన్ని సున్నితంగా మరియు మరింత సంతృప్తికరంగా చేస్తుంది..." అని అన్నారు. 
 
తమ సమగ్ర మరియు సమీకృత పరిష్కారాలతో, HiWi విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సలహాదారులు మరియు విశ్వవిద్యాలయాల అవసరాలు మరియు ఆందోళనలను పరిష్కరిస్తుంది, విదేశాలలో చదువుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు మరింత సౌకర్యవంతంగా మలుస్తుంది. సౌలభ్యం, సమ్మతి మరియు ఆర్థిక నిర్వహణపై ప్లాట్‌ఫారమ్ దృష్టి కేంద్రీకరించడం వల్ల విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు సౌకర్యవంతమైన  అనుభవాన్ని పొందాలనుకునే విద్యార్థులకు ఇది ఆదర్శవంతమైన ఎంపిక.