శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (09:30 IST)

దేశంలో పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగ్గా... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా మంగళవారం పసిడి 10 గ్రాముల ధరపై స్వల్పంగా రూ.30 తగ్గింది. కానీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మాత్రం రూ.240 వరకు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది.
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.