శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (11:07 IST)

కరోనాను తొక్కేస్తున్న పసిడి, ఆకాశానికి దూసుకెళ్తున్న బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌తో దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్‌ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు  ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది.

న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.50,000 కొంచెం అటు ఇటూ పలుకుతుండడం గమనార్హం.


ప్రపంచ వృద్ధికి కోవిడ్‌–19 భయాలు, దీనితో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడం, దీనికితోడు వృద్ధికి బలాన్ని ఇవ్వడానికి అమెరికా ఫెడ్‌సహా పలు సెంట్రల్‌ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానాలను అవలంభిస్తుండడం వంటి అంశాలు పసిడికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి.