శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (10:12 IST)

వ్యాక్సిన్ ఎఫెక్ట్.. పసిడి, వెండి ధరలు తగ్గాయి..

పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సిన్ కారణంగా పసిడి, వెండి ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ఊరట లభించింది.

రష్యా నుంచి వస్తున్న తొలి వ్యాక్సిన్ మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడు పుతిన్ తన కుమార్తె మీదే ప్రయోగం చేయడంతో ప్రపంచానికి పెద్ద రిలీఫ్ లభించింది. దాంతో పెరిగిన పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 
 
గరిష్టంగా రూ.58,250కి చేరుకున్న పది గ్రాముల పసిడి ధర రూ.54,600కు దిగివచ్చింది. అదే విధంగా వెండి ధర కిలో రూ.76,000 నుంచి 67,000లకు దిగింది. ముందంజలో ఉన్న మరో రెండు వ్యాక్సిన్లు అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు కూడా సక్సెస్ అయితే బంగార, వెండి ధరల్లో మరింత క్షీణత కనబడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
వ్యాక్సిన్లు విజయవంతమైతే సాధారణ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. విభిన్న రంగాల్లో పెట్టుబడుల ఆవశ్యకత మెరుగుపడుతుంది. స్ఠాక్ మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తగ్గి ధరలు కూడా తగ్గుముఖం పడతాయి.